దత్తత తీసుకుంటే హతమార్చాడు..
ABN , Publish Date - Mar 20 , 2026 | 08:25 AM
అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలు లీలాదేవికి పప్పురామ్ సొంత తమ్ముడు కాదని తేలింది. లీలాదేవి తల్లిదండ్రులకు ఏడుగురు ఆడపిల్లలు.
ఆస్తి వాటాల్లో గొడవలు
అక్క హత్య కేసులో తమ్ముడిసహా ముగ్గురికి రిమాండ్
హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలు లీలాదేవికి పప్పురామ్ సొంత తమ్ముడు కాదని తేలింది. లీలాదేవి తల్లిదండ్రులకు ఏడుగురు ఆడపిల్లలు. మగ పిల్లలు లేకపోవడంతో మృతురాలు సోదరుడి కుమారుడైన పప్పురామ్‌ను చిన్నప్పుడే దత్తత తీసుకున్నట్లు తెలిసింది. నాటినుంచి పప్పురామ్(Pappuram)ను సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకుంది. ఆమె వద్దనే ఉంటూ ఎల్‌బీనగర్‌లో షాపు చూసుకునేవాడు. భర్త చనిపోయినప్పటి నుంచి అన్ని బాధ్యతలను అతడికి అప్పగించింది. ఏడాదిన్నర క్రితం బాటసింగారంలో 120 గంజాల ఇల్లు కొనుగోలు చేశారు.
అక్కడే ఉంటూ స్థానికంగా కిరాణాషాపు నిర్వహిస్తున్నారు. పప్పురామ్‌ను పూర్తిగా నమ్మిన మృతురాలు లీలాదేవి ఇంటితో పాటు షాపు, కారును అతడి పేరుపై రిజిస్ర్టేషన్ చేయించింది. ఆస్తి విషయంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. తన వాటా పంచాలని పప్పురామ్‌ను ఒత్తిడి చేసింది. గతనెల 28వ తేదీన ఇద్దరూ గొడవపడ్డారు. కోపోద్రిక్తుడైన అతడు కర్రతో లీలావతి తలపై కొట్టడంతో చనిపోయింది. ఏమి చేయాలో తోచక షాపులో పనిచేస్తున్న రాకేష్, సునీల్‌కు విష యం చెప్పాడు. మృతదేహాన్ని బాత్‌రూమ్‌లో దాచిపెట్టారు. రెండు రోజుల తర్వాత మృతదేహాన్ని మజీద్‌పూర్ తీసుకెళ్లి రెండు ముక్కలు చేసి చెరువులో పడేశారు.
ఎనిమిది రోజుల తర్వాత..
ఎనిమిది రోజుల తర్వాత తన అక్క కనిపించడం లేదని పప్పురామ్ అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వేరే వారితో ఫోన్‌లో మాట్లాడేదని పోలీసులకు చెప్పాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పుప్పురామ్‌పై అనుమానంతో బుధవారం అదుపులోకి తీసుకొని విచారించగా జరిగిన విషయం చెప్పి నేరాన్ని అంగీకరించాడు. అతడితోపాటు సహకరించిన రాకేష్, సునీల్‌కుమార్‌ను గురువారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News