హానికర రసాయనాలతో ఐస్‌క్రీం తయారీ
ABN , Publish Date - Mar 31 , 2026 | 07:53 AM
ట్రేడ్, ఫుడ్ లైసెన్స్ లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో, హానికర రసాయనాలతో ఐస్ క్యాండీ, లస్సీ తయారు చేస్తున్న ఐస్‌క్రీం పార్లర్‌పై గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం దాడులు చేశారు.
ఆలియా నిర్వాహకుడి అరెస్ట్
హైదరాబాద్ సిటీ: ట్రేడ్, ఫుడ్ లైసెన్స్ లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో, హానికర రసాయనాలతో ఐస్ క్యాండీ, లస్సీ తయారు చేస్తున్న ఐస్‌క్రీం పార్లర్‌పై గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం దాడులు చేశారు. నిర్వాహకుడిని అరెస్ట్ చేయడంతో పాటు రూ.5.44 లక్షల విలువైన యంత్రాలు, సరుకు స్వాధీనం చేసుకున్నారు. అహ్మద్‌నగర్‌కు చెందిన సయ్యద్ ముషరావుద్దీన్ (24) మెహిదీపట్నం, అహ్మద్‌నగర్, బడాబజార్, ఫస్ట్‌లాన్సర్ ప్రాంతాల్లో ఆలియా ఐస్‌క్రీమ్ పేరుతో పార్లర్లను నిర్వహిస్తున్నాడు.
ఇతడు ట్రేడ్, ఫుడ్ లైసెన్స్ లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో హానికర రసాయనాలతో ఐస్ క్యాండీ, లస్సీ తయారు చేస్తున్నాడు. ఇతడి దందాపై పక్కా సమాచారమందుకున్న గోల్కొండ టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ జి విజయానంద్ ఆధ్వర్యంలో మెహిదీపట్నం, అహ్మద్‌నగర్, బడాబజార్, ఫస్ట్‌లాన్సర్ ప్రాంతాల్లో ఉన్న ఆలియా ఐస్‌క్రీం పార్లర్లపై దాడులు చేశారు. ఐస్ క్యాండీలు, లస్సీని హానికర రసాయనాలతో తయారు చేస్తున్నట్లు గుర్తించి నిర్వాహకుడు సయ్యద్ ముషరావుద్దీన్‌ను అరెస్ట్ చేశారు.
రూ. 5.44 లక్షల విలువైన ఐస్ క్యాండీ, లస్సీ తయారు చేసే యంత్రాలతోపాటు ఫ్రిజ్‌లు, ప్యాకింగ్ మెషీన్‌లు, చక్కెర, సిట్రిక్ యాసిడ్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని మెహదీపట్నం పోలీసులకు అప్పగించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎంఎల్‌ఎం మోసగాళ్లకు పదేళ్ల జైలు
దేశంలో మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయింది: హోంమంత్రి అమిత్ షా
Read Latest Telangana News and National News