Share News

యుద్ధ పరిస్థితుల్లోనూ గల్ఫ్‌లో టీడీపీ వేడుకలు

ABN , Publish Date - Mar 31 , 2026 | 06:30 AM

పశ్చిమ ఆసియాలో తీవ్ర యుద్ధ ఉద్రిక్తతల నడుమ తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని గల్ఫ్‌ దేశాల్లో ఎన్నారై టీడీపీ గల్ఫ్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.

యుద్ధ పరిస్థితుల్లోనూ గల్ఫ్‌లో టీడీపీ వేడుకలు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

పశ్చిమ ఆసియాలో తీవ్ర యుద్ధ ఉద్రిక్తతల నడుమ తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని గల్ఫ్‌ దేశాల్లో ఎన్నారై టీడీపీ గల్ఫ్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. గల్ఫ్‌ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు, ఏపీ ఎన్నార్టీ చైర్మన్‌ వేమూరి రవి, బ్రహ్మణ పరిషత్‌ చైర్మన్‌ కే బుచ్చిరాం ప్రసాద్‌ వీడియో కాల్‌లో గల్ఫ్‌లోని వివిధ దేశాల్లోని టీడీపీ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. సామాన్య ప్రవాసీయుల సాధకబాధకాలను పరిష్కరించే దిశగా పార్టీ చేసిన విప్లవాత్మక మార్పులను ఏపీ ఎన్నార్టీ డైరెక్టర్‌ అక్కిలి నాగేంద్రబాబు వివరించారు. సౌదీ అరేబియా, కువైత్‌ దేశాల్లోని తెలుగుదేశం పార్టీ మహిళలు మహిళా సాధికారిత దిశగా టీడీపీ అవిర్భావం నుండి చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఖతర్‌, ఒమన్‌, బహ్రెయిన్‌ దేశాల్లోని పార్టీ నాయకులు పార్టీ వైభవాన్ని వివరించారు.

Updated Date - Mar 31 , 2026 | 06:31 AM