Share News

ఎంఎల్‌ఎం మోసగాళ్లకు పదేళ్ల జైలు

ABN , Publish Date - Mar 31 , 2026 | 06:19 AM

మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌(ఎంఎల్‌ఎం) పేరుతో ప్రజల్ని మోసం చేసిన నిందితులకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

ఎంఎల్‌ఎం మోసగాళ్లకు పదేళ్ల జైలు

అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌(ఎంఎల్‌ఎం) పేరుతో ప్రజల్ని మోసం చేసిన నిందితులకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. చెన్నైకి చెందిన ఎంఎస్‌ క్విస్ట్‌ నెట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు ఆగస్టిన్‌ జోసెఫ్‌, ఆర్‌ కామాక్షి రంగనాథన్‌, పు ష్పం అప్పలనాయుడును నెల్లూరు జిల్లా కోర్టు దోషులుగా తేల్చింది. ఈ ముగ్గురికీ పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. మనీ సర్కులేషన్‌ పేరుతో ఏపీలోని కడప, నెల్లూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రజల్ని మోసం చేసినట్లు 2008లో ఫిర్యాదులు అందాయి. వాటన్నింటినీ అప్పటి ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. 2016లో పక్కా ఆధారాలతో అప్పటి డీఎస్పీ ఎస్‌కే ముస్తఫా కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు.

Updated Date - Mar 31 , 2026 | 06:20 AM