నష్టాల్లో దేశీయ మార్కెట్లు.. 300 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్.. 25,810 దిగువకు నిఫ్టీ
ABN , Publish Date - Nov 27 , 2026 | 10:37 AM
వరుస లాభాల తర్వాత ఇవాళ దేశీయ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి . సెన్సెక్స్ 300 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 25,810 దిగువకు చేరుకుంది.
ఆంధ్రజ్యోతి, నవంబర్ 27: ఈ నెల రోజుల వ్యవధిలో సెన్సెక్స్ దాదాపు పదివేల పాయింట్లకు పేగానే పెరిగింది. ఇలా వరుస లాభాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లకు ఇవాళ (శుక్రవారం) బ్రేక్ పడింది. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, ముడిచమురు ధరలు మళ్లీ భగ్గుమనడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 10:25 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 302.71 పాయింట్లు (0.36 శాతం) నష్టపోయి 84,025.88 వద్ద కొనసాగుతుండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 76.80 పాయింట్లు (0.30 శాతం) తగ్గి 25,807.70 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ క్రితం ముగింపు 84,328.59తో పోలిస్తే నేడు 84,093.24 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఆరంభంలో 84,286.18 వరకు కోలుకునే ప్రయత్నం చేసినప్పటికీ, ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో 83,932.34 కనిష్ఠ స్థాయిని తాకి, 84,000 కీలక మద్దతు స్థాయి సమీపంలో కదలాడుతోంది.
నిఫ్టీ సైతం 25,843.40 వద్ద ప్రారంభమై, ఇంట్రాడేలో 25,885 గరిష్ఠాన్ని తాకినప్పటికీ నిలదొక్కుకోలేకపోయింది. 25,850 కీలక స్థాయిని కోల్పోయి 25,807.70 వద్ద ట్రేడవుతోంది.
గత నాలుగు వారాల్లో సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పుంజుకున్న నేపథ్యంలో గరిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు లాభాలను సొమ్ము చేసుకోవడానికి విక్రయాలకు దిగడం మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది.
మరోవైపు, హోర్ముజ్ జలసంధిలో ఇంధన ట్యాంకర్లపై దాడులు, సౌదీ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడుల నేపథ్యంలో చమురు సరఫరాపై ఆందోళనలు పెరిగి బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర సుమారు 96 డాలర్ల స్థాయికి ఎగబాకడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
ఈ వార్తలనూ చదవండి:
గోల్డ్ రేట్స్.. మీ నగరంలో ధరలు ఇవీ
చంద్రశేఖరన్ పునర్నియామకంపై బాంబే హైకోర్టుకు టాటా ట్రస్ట్‌లు