చంద్ర పునర్నియామకంపై బాంబే హైకోర్టుకు టాటా ట్రస్ట్‌లు
ABN , Publish Date - Nov 27 , 2026 | 03:40 AM
టాటా సన్స్ బోర్డు-టాటా ట్రస్టుల మధ్య నెలకొన్న వివాదం బాంబే హైకోర్టుకు చేరింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా (మూడో పర్యాయం) ఎన్ చంద్రశేఖరన్‌ను...
టాటా సన్స్ బోర్డు నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు
రూ.65 కోట్ల నష్ట పరిహారం డిమాండ్.. నేడు కేసు విచారణ
న్యూఢిల్లీ: టాటా సన్స్ బోర్డు-టాటా ట్రస్టుల మధ్య నెలకొన్న వివాదం బాంబే హైకోర్టుకు చేరింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా (మూడో పర్యాయం) ఎన్ చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల కాలానికి తిరిగి నియమిస్తూ, సెప్టెంబర్ 17న బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (ఎస్‌డీటీటీ), ఆర్‌డీ టాటా ట్రస్ట్ (ఆర్‌డీటీటీ) బాంబే హైకోర్టులో గురువారం పిటిషన్లు దాఖలు చేశాయి. సర్ దొరాబ్జీ ట్రస్ట్ రూ.50 కోట్ల నష్ట పరిహారాన్ని, ఆర్‌డీ టాటా ట్రస్ట్ రూ.15 కోట్ల నష్ట పరిహారాన్ని 18 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని కోరాయి. సెప్టెంబర్ 17నాటి నిర్ణయం చట్టప్రకారం చెల్లదని.. టాటా సన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (ఏఓఏ)లోని ఆర్టికల్ 121 కింద.. అవసరమైనంత మెజారిటీ ఓట్లు లభించలేదని పేర్కొన్నాయి. ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపడతామని జస్టిస్ అహుజా తెలిపారు.
ఛారిటీ కమిషనర్‌ను ఆశ్రయించిన విజయ్ సింగ్: చంద్ర పునర్నియామకాన్ని నోయల్ టాటా బాంబే హైకోర్టులో సవాలు చేసిన కొద్దిగంటలకే టాటా ట్రస్ట్‌ల వైస్ చైర్మన్, రక్షణ శాఖ మాజీ కార్యదర్శి విజయ్ సింగ్ మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్‌ను ఆశ్రయించారు. హైకోర్టులో సవాలు చేయడాన్ని ట్రస్ట్ సభ్యులుగా తనతోపాటు వేణు శ్రీనివాసన్ వ్యతిరేకించడం జరిగిందని కమిషనర్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రస్ట్‌లను, వాటి ఆస్తులను రక్షించడంతోపాటు ట్రస్ట్‌లు దాతృత్వ కార్యక్రమాలను కొనసాగించేలా చూడాలని కమిషనర్‌ను విజయ్ సింగ్ కోరారు.
ఇవి కూడా చదవండి...
కుటుంబంతో కలిసి ఓటు వేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్.. ఉదయం 8 గంటలకు 8.32 శాతం నమోదు
Read Latest AP News And Telugu News