జన్ ధన్‌కు పుష్కరం
ABN , Publish Date - Aug 28 , 2026 | 02:28 AM
ప్రధాన మంత్రి జన్ ధన్ పథకం (పీఎంజేడీవై) పుష్కర కాలం పూర్తి చేసుకుంది. ఈ పన్నెండేళ్లలో జన్ ధన్ ఖాతాల సంఖ్య 59 కోట్లు దాటగా.. ఆ అకౌంట్లలో ఇప్పటి వరకు రూ.3.17 లక్షల కోట్లు జమైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం వెల్లడించింది.
12 ఏళ్లలో 59 కోట్లు దాటిన ఖాతాలు..
రూ.3.17 లక్షల కోట్లకు మొత్తం డిపాజిట్లు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జన్ ధన్ పథకం (పీఎంజేడీవై) పుష్కర కాలం పూర్తి చేసుకుంది. ఈ పన్నెండేళ్లలో జన్ ధన్ ఖాతాల సంఖ్య 59 కోట్లు దాటగా.. ఆ అకౌంట్లలో ఇప్పటి వరకు రూ.3.17 లక్షల కోట్లు జమైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం వెల్లడించింది. గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లోని పేదలకు సైతం సంఘటిత బ్యాంకింగ్ సేవలందించే ఉద్దేశంతో ప్రధాని మోదీ 2014 ఆగస్టు 28న పీఎంజేడీవైని ప్రారంభించారు. జన్ ధన్ ఖాతాల్లో 78 శాతం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తెరిచినవే. అంతేకాదు, మొత్తం ఖాతాల్లో 59 శాతం మహిళలవే. 2026 ఆగస్టు 19 నాటికి ఒక్కో జన్ ధన్ ఖాతాలోని సగటు డిపాజిట్ రూ.5,356గా నమోదైంది. గడిచిన 12 సంవత్సరాల్లో ఈ సగటు విలువ 3.4 రెట్లు పెరిగిందని ఆర్థిక శాఖ తెలిపింది. జన్ ధన్ పథకంలో భాగంగా అర్హులైన వ్యక్తులు బేసిక్ సేవింగ్ ఖాతాను ప్రారంభించవచ్చు. ఈ అకౌంట్‌కు కనీస నిల్వ అవసరం గానీ, కనీస నిల్వ నిర్వహణ వైఫల్య చార్జీలుండవు. అంతేకాదు, ఈ ఖాతాలపై రూపే డెబిట్ కార్డులను కూడా జారీ చేస్తారు. ఈ కార్డుపై రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కూడా ఉంటుంది. ఇప్పటివరకు జన్ ధన్ ఖాతాదారులకు 41.29 కోట్ల రూపే కార్డులను జారీ చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే, అర్హులైన జన్ ధన్ ఖాతాదారులకు రూ.10,000 వరకు ఓవర్‌డ్రా్‌ఫ్ట (ఓడీ) సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ వార్తలనూ చదవండి:
నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్
నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News