కన్సాలిడేషన్‌కు అవకాశం..!
ABN , Publish Date - Aug 17 , 2026 | 05:19 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం కన్సాలిడేషన్ బాట పట్టే అవకాశం ఉంది. నిఫ్టీ మద్దతు స్థాయిలైన 24,200 వద్ద గట్టి పరీక్షను ఎదుర్కొననుండగా.. 24,550 వద్ద తీవ్ర నిరోధం ఎదురుకానుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం కన్సాలిడేషన్ బాట పట్టే అవకాశం ఉంది. నిఫ్టీ మద్దతు స్థాయిలైన 24,200 వద్ద గట్టి పరీక్షను ఎదుర్కొననుండగా.. 24,550 వద్ద తీవ్ర నిరోధం ఎదురుకానుంది. ఈ వారం ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు రాణించే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా రంగాల్లో లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. మరోవైపు పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపించనున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాలు వెలువెడుతున్న తరుణంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించటం మంచిది.
స్టాక్ రికమండేషన్స్
పారస్ డిఫెన్స్: ఏప్రిల్ నుంచి 144 శాతం రాబడిని అందించిన ఈ షేరు జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతోంది. అయితే కొద్దిగా పుల్‌బ్యాక్‌కు లోనైంది. స్వల్పకాల మూవింగ్ యావరేజీ వద్ద మద్దతు తీసుకున్నాయి. రిలేటివ్ స్ట్రెంత్ కూడా బాగుంది. వాల్యూమ్ గణనీయంగా పెరిగింది. గత శుక్రవారం రూ.1,337 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,330 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.1,470 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,300 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
భారతి ఎయిర్‌టెల్: జీవితకాల గరిష్ఠం తర్వాత ఈ షేరు దిద్దుబాటుకు లోనైంది. ప్రస్తుతం మంచి బేస్ ఏర్పడుతోంది. అప్‌ట్రెండ్ ఇప్పుడే ప్రారంభమైంది. రిలేటివ్ స్ట్రెంత్ క్రమంగా పుంజుకుంటోంది. గత శుక్రవారం రూ.1,992 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,940 ఎగువన ప్రవేశించి రూ.2,150 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,920 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్: ఐపీఓ ఆరంభం నుంచి ఈ షేరు బుల్‌రన్‌ను కొనసాగిస్తూనే ఉంది. ఈ ఏడాది ఆరంభం నుంచి జూన్ వరకు దాదాపు 240 శాతం రాబడిని అందించింది. ఆ తర్వాత 26 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. మళ్లీ పుంజుకునేందుకు సిద్ధమైంది. రిలేటివ్ స్ట్రెంత్‌కు తిరుగులేదు. గత శుక్రవారం రూ.459 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.450 శ్రేణిలో ప్రవేశించి రూ.530/580 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.425 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
లాయిడ్ మెటల్స్: ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ షేరు 80 శాతానికి పైగా రాబడినిచ్చింది. అయితే రూ.2,100 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత 12శాతం వరకు దిద్దుబాటుకులోనైంది. రిలేటివ్ స్ట్రెంత్ మెరుగ్గా ఉంది. గత శుక్రవారం రూ.1,918 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,900 ఎగువన ప్రవేశించి రూ.2,100 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,870 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
అపోలో మైక్రోసిస్టమ్స్: ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై ఆరంభంనాటికి ఈ షేరు దాదాపు 150 శాతం మేర పెరిగింది. బేస్ బ్రేకౌట్ తర్వాత కన్సాలిడేషన్ కొనసాగుతోంది. స్వల్పకాల మూవింగ్ యావరేజీ మధ్య మద్దతు తీసుకోవటంతో ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరిగింది. గత శుక్రవారం రూ.393 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.390 ఎగువన పొజిషన్ తీసుకుని రూ.440/470 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.375 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
వార్తలు కూడా చదవండి...
జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు
నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్
నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు