Share News

త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయా..?

ABN , Publish Date - Oct 19 , 2026 | 08:33 AM

త్వరలో దేశంలో ఇంధన ధరలు పెరగనున్నాయా..? అవుననే అంటున్నారు ఆర్థికవేత్తలు. నవంబర్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశముందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్‌ ముఖ్య ఆర్థికవేత్త అలెగ్జాండ్రా హర్మన్ ప్రసాద్ విశ్లేషించారు.

త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయా..?
Petrol Price Hike

ఇంటర్నెట్ డెస్క్: త్వరలో దేశంలో ఇంధన ధరలు పెరగనున్నాయా..? అవుననే అంటున్నారు ఆర్థికవేత్తలు. నవంబర్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశముందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్‌ ముఖ్య ఆర్థికవేత్త అలెగ్జాండ్రా హర్మన్ ప్రసాద్ విశ్లేషించారు. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నవంబర్‌లోనే ధరల్లో పెరుగుతాయని ఆయన అంచనా వేశారు. గత మేలో ప్రకటించిన ఇంధన ధరల పెంపులో సగం వరకు ఈ పెరుగుదల ఉండవచ్చని పలువురు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా కేంద్రం మేలో ఇంధన ధరలు పెంచిన విషయం తెలిసిందే. ఈ పెరుగుదల వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 6.2 శాతానికి, 2027 మొదటి మూడు నెలల్లో 6.5 శాతానికి చేరవచ్చని, తద్వారా ఆర్‌బీఐ నిర్దేశించిన 2 నుంచి 6 శాతం ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని మించిపోతుందని ఆర్థికవేత్తలు వివరిస్తున్నారు.


ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ అంచనా..

అక్టోబర్ ప్రారంభంలో జరిగిన ద్రవ్య విధాన సమీక్షా సమావేశంలో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంటుందని, జనవరి-మార్చిలో ఇది 5.7 శాతానికి తగ్గుతుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగిసేపాటికి ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు వచ్చే ఏడాది ధరల ఒత్తిడి పెరుగుతుందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ భావిస్తోంది. మార్చిలో ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తోంది.


ఇవీ చదవండి

ఈ వారం పసిడి ధరల్లో మరింతగా హెచ్చుతగ్గులు.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు ధరల సెగ

Updated Date - Oct 19 , 2026 | 09:01 AM