Home » Fuel Prices
రిటైల్ పెట్రోల్ బంకుల్లో వాణిజ్య అవసరాల కోసం ఇంధన కొనుగోళ్లకు కేంద్రం బ్రేకులు వేసింది. వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు ఇకపై బల్క్ సరఫరాదారుల వద్దనే ఇంధన కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించింది.
పెట్రోల్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. అయితే.. అందరూ ఉపయోగించే సాధారణ పెట్రోల్‌కు కాదు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఇథనాల్ మిక్స్‌డ్ పెట్రోల్ వినియోగించే వారికి మాత్రమే.
వాహనదారులకు ఈ ఉదయాన్నే మరో గట్టి షాక్ తగిలింది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇంధన పంపిణీ సంస్థలు కంప్రెస్‌డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను కిలోగ్రాముకు రూ. 2 మేర పెంచాయి.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. రాబోయే రెండు మూడు వారాల్లో మరో రూ.10ల మేర ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
పశ్చిమాసియా పరిస్థితుల దృష్ట్యా దేశ ఇంధన భద్రత, నిత్యావసర వస్తువుల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ IGoM సమావేశాన్ని నిర్వహించి ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు.
పెట్రోల్ బంకుల వద్ద నెలకొన్న రద్దీని తగ్గించి, సరఫరాను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పడుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే ఉపేక్షించమని స్పష్టం చేశారు.
పెట్రోల్, డీజిల్ సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ రవాణా సేవలు ఆగకూడదని అధికారులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. రవాణా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.28 మేర పెరగనున్నాయన్న వార్తలపై కేంద్రం తాజాగా స్పందించింది. ఆ కథనాల్లో వాస్తవం లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.
ఎయిర్ ఇండియా ఇంధన సర్‌ఛార్జీలను భారీగా పెంచేసింది. డొమెస్టిక్ విమాన సర్వీసులపై స్లాబ్ బేస్డ్ ధరలు.. అంతర్జాతీయ విమాన సర్వీసులపై రీజియన్ బేస్డ్ ధరలు అమలవ్వనున్నాయి.