ప్రయాణికులకు షాక్.. ఇంధన సర్‌ఛార్జీలను పెంచిన ఎయిరిండియా
ABN , Publish Date - Apr 08 , 2026 | 08:56 AM
ఎయిర్ ఇండియా ఇంధన సర్‌ఛార్జీలను భారీగా పెంచేసింది. డొమెస్టిక్ విమాన సర్వీసులపై స్లాబ్ బేస్డ్ ధరలు.. అంతర్జాతీయ విమాన సర్వీసులపై రీజియన్ బేస్డ్ ధరలు అమలవ్వనున్నాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన సర్‌ఛార్జీలను భారీగా పెంచేసింది. డొమెస్టిక్ సర్వీసులపై కనిష్ఠంగా 299 రూపాయల నుంచి గరిష్ఠంగా 899 రూపాయలు వసూలు చేయనుంది. డొమెస్టిక్ విమాన సర్వీసులపై స్లాబ్ బేస్డ్ ధరలు.. అంతర్జాతీయ విమాన సర్వీసులపై రీజియన్ బేస్డ్ ధరలు అమలవ్వనున్నాయి. డొమెస్టిక్ సర్వీసులకు సంబంధించి పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమలు అవ్వనున్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించి ఈ నెల 10వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి.
సర్‌ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో డొమెస్టిక్ సర్వీసులకు సంబంధించి ప్రయాణికుడిపై 1500 రూపాయల అదనపు భారం పడనుంది. అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించి ఏకంగా 15 వేల రూపాయల అదనపు భారం పడనుంది. యుద్ధం నేపథ్యంలో ఏటీఎఫ్ ధరలు పెరగడంతో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.
ఎయిర్ ఇండియాకు క్యాంప్‌బెల్ గుడ్‌బై..
ఎయిర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పదవులకు క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా చేశారు. న్యూజిలాండ్‌కు చెందిన విల్సన్ గతంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ గ్రూపులో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2022లో ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత విల్సన్ ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. తన పదవులకు 2026లో రాజీనామా చేయబోతున్నట్లు.. 2024లోనే ఎయిర్ ఇండియా ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు తెలియజేశారు. విల్సన్ ముందుగా చెప్పినట్లుగా తాజాగా తన పదవులకు రాజీనామా చేశారు.
ఇవి కూడా చదవండి
విజయవాడ ఉగ్రవాద కేసులో షాకింగ్ విషయాలు.. 42 మంది అమ్మాయిలను..
తూర్పుగోదావరి జిల్లాలో అగ్నిప్రమాదం