ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు ధరల సెగ
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:05 AM
వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీలకు సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2) పెద్దగా కలిసి రాలేదు....
దీపావళి తర్వాత ధరల పెంపు
న్యూఢిల్లీ: వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీలకు సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2) పెద్దగా కలిసి రాలేదు. ప్రధాన ముడి పదార్ధాలైన పామాయిల్, చక్కెర ధరలు 18 నుంచి 21ు పెరిగాయి. అయినా అమ్మకాలు ఎక్కడ దెబ్బతింటాయోననే భయంతో కంపెనీలు సెప్టెంబరు త్రైమాసికంలో ధరలు పెద్దగా పెంచలేదు. దీంతో గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఎఫ్‌ఎంసీజీ కంపెనీల లాభాలకు 0.45ు వరకు గండిపడింది. ఈ ఒత్తిడి ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో పండగ సీజన్ అమ్మకాలు దెబ్బతినకుండా దీపావళి తర్వాత ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అయితే మాస్ మార్కెట్ వస్తువుల థరల పెంపుపై కంపెనీలు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ధరలు భారీగా పెంచితే అమ్మకాలు పడిపోయే ప్రమాదం ఉందని కంపెనీలు భయపడుతున్నాయి. దీంతో ఈ వస్తువుల ధరల పెంపు కంటే ఖర్చుల నియంత్రణ, ప్యాకెట్ సైజు తగ్గించడం వంటి చర్యలకు కంపెనీలు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు
దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ