పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ పతనమైన ధరలు
ABN , Publish Date - Mar 13 , 2026 | 10:41 AM
గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం, వెండి రేట్లు మరోసారి పతనమయ్యాయి. ప్రస్తుతం.. మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే...
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. గురువారంతో పోలిస్తే నేటి మార్కెట్లలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఇంకాస్త దిగొచ్చాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. శుక్రవారం ఉదయం 10:00 గంటల సమయంలో బంగారం, వెండి రేట్లను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధరపై రూ.980 పతనమై రూ.1,61,240కు చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.900 తగ్గి రూ.1,47,800 వద్ద ట్రేడవుతోంది(Gold Rates Today).
ఇక వెండి విషయానికొస్తే.. క్రితం రోజుతో పోలిస్తే కిలో వెండిపై రూ.100 తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,79,900గా ఉంది(Silver Rates Today). అయితే.. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడమే ధరల తగ్గుదలకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే అందించడమైనది. బంగారం ధరలు పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. నగరం, మేకర్/జ్యువెలర్ ఆధారంగా రేట్లలో స్వల్ప తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాలని సూచించడమైనది.
ఇవీ చదవండి:
సన్‌రైజర్స్‌లోకి పాక్ క్రికెటర్.. క్లారిటీ ఇచ్చిన యాజమాన్యం
రష్యా చమురు కొనుగోలుకు అమెరికా గ్రీన్ సిగ్నల్