క్రెడిట్ కార్డ్ లేకపోయినా క్రెడిట్ స్కోర్ పెంచుకోండిలా..!
ABN , Publish Date - Oct 03 , 2026 | 09:56 PM
క్రెడిట్ స్కోర్ అనేది కేవలం క్రెడిట్ కార్డ్‌పై ఆధారపడి ఉండదు. క్రెడిట్ కార్డ్ లేకున్నా మంచి క్రెడిట్ స్కోర్‌ను మెయింటెయిన్ చేయవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: క్రెడిట్ స్కోర్ అనేది కేవలం క్రెడిట్ కార్డ్‌పై ఆధారపడి ఉండదు. క్రెడిట్ కార్డ్ లేకున్నా మంచి క్రెడిట్ స్కోర్‌ను మెయింటెయిన్ చేయవచ్చు. సిబిల్ స్కోర్ అనేది రుణ చెల్లింపులపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పటివరకు ఎలాంటి రుణాన్ని తీసుకోకపోతే సిబిల్ స్కోర్ ఉండదు. ఇలాంటి సందర్భంలో చిన్న లోన్లు తీసుకుని, వాటి వాయిదాలను సకాలంలో చెల్లించి క్రెడిట్ స్కోర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఫైనాన్స్‌పై మొబైల్ లేదా గృహోపకరణాలు తీసుకుని నెలవారీ ఈఎమ్ఐ క్రమం తప్పకుండా కడితే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. అయితే లోన్ తీసుకోవడం కాదు.. సకాలంలో చెల్లించడం ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలి. బైక్ లోన్ కూడా క్రెడిట్ హిస్టరీని ప్రభావితం చేస్తుంది.
కేవలం స్కోర్ పెంచుకోవడానికి లోన్ తీసుకోవడం మంచి నిర్ణయం కాకపోవచ్చు. అలా చేయడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. ఎందుకంటే రుణం పొందాక వడ్డీలు, ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. అవసరముంటేనే రుణం తీసుకోవాలి. ఒక్కసారి లోన్ తీసుకున్నాక సిబిల్ స్కోర్ ప్రారంభమవుతుంది. వాయిదాలను ఆలస్యంగా కట్టడం, అసలు కట్టకపోవడం వంటివి ఆ స్కోర్‌ను నిర్ణయిస్తాయి.
రుణదాతలు క్రెడిట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని లోన్ ఇస్తారు. అందుకే ఈ స్కోర్‌ను మెయింటెయిన్ చేయడం ముఖ్యం. క్రెడిట్ కార్డ్ లేని వాళ్లు ఈఎమ్ఐ చెల్లింపులతో సిబిల్ పెంచుకోవచ్చు.
ఈ వార్తలూ చదవండి
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ ఏడు మోసాల పట్ల జాగ్రత్త వహించండి..
క్రిప్టోపై ఇప్పటికీ అప్రమత్తంగానే ఉన్నాం: ఆర్బీఐ గవర్నర్