బడ్జెట్ 2026: సామాన్యులకు భారీ ఊరట.. ఈ వస్తువుల ధరలు తగ్గే ఛాన్స్..
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:09 AM
కేంద్ర బడ్జెట్ అనగానే అందరిలో మొదటగా మెదిలే ప్రశ్న ఒకటుంటుంది. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి? వేటి ధరలు తగ్గుతాయి? అనే విషయాన్ని గమనిస్తూ ఉంటారు. కేంద్రం బడ్జెట్‌లో తీసుకునే నిర్ణయాలు, పన్నుల మినహాయింపులు, సుంకాలు, జీఎస్టీ రేట్లల్లో సవరణలతోనే వస్తువుల ధరల్లో మార్పులు వస్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28(బుధవారం) నుంచి ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం(జనవరి 29న) ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సర్వే ద్వారా పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. దీంతో ఫిబ్రవరి 1న రానున్న బడ్జెట్(Budget 2026) ఎలా ఉంటుందనే దానిపై సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరిలో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈసారి బడ్జెట్‌పై పలువురు ఆర్థిక నిపుణులు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం క్రమంలో 2026-27 కేంద్ర బడ్జెట్ కీలకంగా మారింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో బడ్జెట్‌లో పలు పన్నుల మినహాయింపులు సహా ఆర్థిక సంస్కరణలూ ఉండనున్నట్టు తెలుస్తోంది.
యూనియన్ బడ్జెట్ అనగానే అందరిలో ఒక ప్రశ్న మెదులుతుంది. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి? వేటి ధరలు తగ్గుతాయి? అనే విషయాన్ని గమనిస్తూ ఉంటారు. కేంద్రం బడ్జెట్‌లో తీసుకునే నిర్ణయాలు, పన్నుల మినహాయింపులు, సుంకాలు, జీఎస్టీ రేట్లల్లో సవరణలతోనే వస్తువుల ధరల్లో మార్పులు వస్తాయి. దీంతో 2026-27 బడ్జెట్ తర్వాత ఏయే వస్తువుల ధరలు ఎలా ఉండనున్నాయనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై అనేక అంచనాలు వెలువడుతున్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబుల్లో మార్పులు, గృహ రుణాలు, ఈఎంఐ, ఎలక్ట్రికల్ వెహికల్స్, పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభావితం చేసేలా పలు నిర్ణయాలు ఈ బడ్జెట్‌లో ఉండనున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
వీటి ధరలు తగ్గే అవకాశం..
1. ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపులు(జీతం తీసుకునేవారికి ఎక్కువ సొమ్ము చేతికి అందే అవకాశం)
2. హోమ్ లోన్స్, ఈఎంఐలు(రుణ ఛార్జీలు తగ్గించే అవకాశం)
3. ఎలక్ట్రికల్ వెహికల్స్(సబ్సిడీలు మరింత పెంపు)
4. ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు(దిగుమతులపై సుంకాలు తగ్గించే అవకాశం)
వీటి రేట్లు పెరిగే అవకాశం..
1. ఇంధనాల(పెట్రోల్, డీజిల్) ధరలు
2. కార్లు(ట్యాక్స్‌లు పెంచే అవకాశం)
3. కన్జ్యూమర్ ప్రోడక్ట్స్
ఆదాయపు పన్నులో రిలీఫ్..
ఆదాయపు పన్ను విషయంలో మినహాయింపులు కచ్చితంగా ఉండనున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల వారికి రూ.25 లక్షల వరకు ఆదాయపు పన్ను రిలీఫ్ సౌకర్యం అందించనున్నారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం.. ఈ ఉద్యోగులకు రూ.15 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ లేదు. బడ్జెట్ 2025-26లో ఈ మేరకు ఉద్యోగులకు ప్రభుత్వం ఊరట కలిగించింది. అయితే ఈసారి అందులో ఎలాంటి మార్పులు లేకపోవచ్చు. ఇక వ్యాపార రంగంలోని వారికి ఈసారి రాయితీలు, ప్రోత్సాహకాలు అధికంగా ఉండనున్నాయి. ప్రధానంగా జీడీపీని వృద్ధి చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఇవీ చదవండి:
కేంద్ర బడ్జెట్ గురించి మీరు తప్ప తెలుసుకోవాల్సిన కీలక అంశాలు ఇవే..!
రూ.40 వేల కోట్ల రిలయన్స్ కుంభకోణం.. బయటపడుతున్న విదేశీ ఆస్తుల గుట్టు!