Share News

ముచ్చటగా మూడో సారి ఉద్యోగాల కోత.. అమెజాన్ రియాక్షన్

ABN , Publish Date - Apr 08 , 2026 | 06:55 PM

ముచ్చటగా మూడో సారి భారీగా ఉద్యోగాల కోతకు ప్రముఖ ఇ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తుందంటూ ఆన్ ఫోరమ్స్, టెక్ పోర్టల్స్‌ వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

ముచ్చటగా మూడో సారి ఉద్యోగాల కోత..  అమెజాన్ రియాక్షన్

ఇంటర్నెట్ డెస్క్: ముచ్చటగా మూడో సారి భారీగా ఉద్యోగాల కోతకు ప్రముఖ ఇ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తుందంటూ ఆన్ ఫోరమ్స్, టెక్ పోర్టల్స్‌ వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండు దశల్లో భారీగా ఉద్యోగులను కొలువుల నుంచి ఈ సంస్థ తొలగించింది. తాజాగా ఈ ఏడాది మే మాసంలో మళ్లీ భారీగా ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగిస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో ఆ సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అమెజాన్ తాజాగా స్పందించింది. ఈ ప్రచారాన్ని అమెజాన్ ఖండించింది. ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని ప్రకటించింది.


చైనాకు చెందిన టెక్ పోర్టల్ లీ ఫెంగ్ నెట్‌వర్క్ సైతం ఈ వార్తను ప్రచురించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, రిటైల్, మానవ వనరుల విభాగంలోని ఉద్యోగులపై ఈ ప్రభావం ఉండవచ్చని చైనా టెక్ పోర్టల్ వివరించింది. అలాగే ఎల్5 నుంచి ఎల్7 ఉద్యోగ స్థాయిల్లోని మేనేజర్లు, వైట్ కాలర్ ఉద్యోగులపై కూడా ఈ ప్రభావం ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ గిడ్డంగి, లాజిస్టిక్స్ సిబ్బందిపై ఈ ప్రభావం ఉండదని నివేదికలు చెబుతున్నాయి.


అయితే ఈ కార్పొరేట్ కంపెనీ ఇప్పటికే 2025 అక్టోబర్‌లో 14 వేల మంది, 2026 జనవరిలో 16 వేల మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించింది. ఈ సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం కోసం సీఈవో ఆండీ జస్సీ నేతృత్వంతో ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. మరోవైపు ఐఏ, మౌలిక సదుపాయాలలో అమెజాన్ సంస్థ భారీగా పెట్టుబడులు పెడుతుంది. ఈ పెట్టుబడులను పెంచుకొంటూ పోతుంది. ఏఐ వినియోగం పెరిగే కొద్ది.. ఉద్యోగుల పాత్ర మునుపటి స్థాయిలో ఉండక పోవచ్చుననే అభిప్రాయాన్ని అమెజాన్ సంస్థ తాజాగా వ్యక్తం చేస్తోంది. 2022 నుంచి ఇప్పటి వరకు 57 వేల మందికిపైగా ఉద్యోగులను అమెజాన్ తొలగించిన విషయం విదితమే.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం కొనాలనుకునేవారికి బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు..

ఆర్బీఐ వడ్డీ రేట్లలో మార్పుల్లేవు.. వృద్ధి రేటు 6.9 శాతంగా అంచనా..

For More Business News And Telugu News

Updated Date - Apr 08 , 2026 | 07:09 PM