ఆర్బీఐ వడ్డీ రేట్లలో మార్పుల్లేవు.. వృద్ధి రేటు 6.9 శాతంగా అంచనా..
ABN , Publish Date - Apr 08 , 2026 | 01:04 PM
కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా రెండోసారి కూడా యధాతథంగా ఉంచింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజాగా వెల్లడించారు. ఈసారి కూడా రెపో రెటులో ఎలాంటి మార్పూ లేదని ప్రకటించారు.
కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా రెండోసారి కూడా యధాతథంగా ఉంచింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజాగా వెల్లడించారు. ఈసారి కూడా రెపో రెటులో ఎలాంటి మార్పూ లేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నామని ప్రకటించారు. దేశ ఆర్థిక వృద్ధిపై ఆశావహ అంచనాలు వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్, అంతర్జాతీయ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు (RBI repo rate unchanged).
ఆర్బీఐ రెపో రేట్లను ఆర్బీఐ యధాతథంగా ఉంచడం వరుసగా ఇది రెండోసారి. గత ఫిబ్రవరిలో జరిగిన సమీక్షలో కూడా వడ్డీ రేట్లలో ఆర్బీఐ ఎలాంటి మార్పులూ చేయలేదు. కాగా, అంతర్జాతీయ పరిస్థితులపై ఆర్బీఐ గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయని, వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.9 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేశారు (India GDP 6.9%).
ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల్లో పెరుగుదల ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపించవచ్చని ఆర్బీఐ గవర్నర్ (Sanjay Malhotra RBI) అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉండొచ్చన్నారు. అలాగే ఏప్రిల్ 3వ తేదీ నాటికి భారత ఫారెక్స్ నిల్వలు 696.1 బిలియన్ డాలర్లు అని పేర్కొన్నారు. మరోవైపు దేశీయ వినియోగం బలంగా ఉందని, పెట్టుబడులు పెరుగుతున్నాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..
ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..