అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ.. తెర వెనుక చైనా..
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:45 PM
గత 40 రోజులుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు ఆపేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
గత 40 రోజులుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు ఆపేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. పాకిస్థాన్ ప్రధాని సూచనల మేరకే గడువును పొడిగించినట్టు ట్రంప్ తెలిపారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ అంగీకరించడం వెనుక చైనా కీలక పాత్ర పోషించిందని వార్తలు వస్తున్నాయి (China US Iran ceasefire).
'కాల్పుల విరమణపై చర్చలు జరపడానికి టెహ్రాన్‌ను ఒప్పించడంలో చైనా ప్రమేయం ఉందా' అని విలేకరులు ప్రశ్నించినపుడు 'అవుననే అనుకుంటున్నా. నేను కూడా విన్నాను' అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఏడాది మే నెలలో చైనా పర్యటనకు ట్రంప్ వెళ్లబోతున్నారు. ఆ సమయం లోపునే ఈ యుద్ధం ముగిసిపోవాలని చైనా భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పాకిస్థాన్, టర్కీ, ఈజిప్టు వంటి మధ్యవర్తుల ద్వారా ఇరాన్‌ను శాంతి మార్గం వైపు నడిపించడంలో చైనా నిశబ్దంగా పని చేసిందని వార్తలు వస్తున్నాయి (Trump China role).
ఇరాన్ యుద్ధంలో బీజింగ్ పాత్రపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా జారీ చేయలేదు (Beijing Iran talks). నిజానికి ఈ యుద్ధం ఆగడం చైనాకు కూడా చాలా కీలకం. ఎందుకంటే చైనాకు ఇరాన్ ప్రధాన ఆయిల్ సరఫరాదారు. హోర్ముజ్ జలసంధి మూసి వేసి ఉండడం చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే శాంతి చర్చల విషయమై చైనా అధికారులు నేరుగా ఇరాన్ నాయకులతోనే సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఏదేమైనా, భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాల్లో చైనా ప్రభావం మరింత పెరుగుతుందనేందుకు ఈ పరిణామం కీలక సంకేతం.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..
ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..