Share News

ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..

ABN , Publish Date - Apr 08 , 2026 | 10:14 AM

ఇరాన్‌పై రెండు వారాల పాటు దాడులు చేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయ మార్కెట్లలో ఫుల్ జోష్ తీసుకొచ్చింది. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు కూడా భారీగా దిగి వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు కూడా భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.

ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..
Stock Market

ఇరాన్‌పై రెండు వారాల పాటు దాడులు చేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయ మార్కెట్లలో ఫుల్ జోష్ తీసుకొచ్చింది. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు కూడా భారీగా దిగి వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు కూడా భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ బలపడింది. సెన్సెక్స్, నిఫ్టీ మూడు శాతానికి పైగా లాభంతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దాదాపు అన్ని రంగాలూ లాభాల్లోనే కదలాడుతున్నాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (74,616)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 2500 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ జోరు కొనసాగుతోంది. చాలా రోజుల తర్వాత 77 వేల మార్క్ దాటింది. ప్రస్తుతం ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 2670 పాయింట్ల లాభంతో 77,286 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా లాభాల బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 777 పాయింట్ల నష్టంతో 23,900 వద్ద కదలాడుతోంది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో అశోక్ లేలాండ్, ప్రెస్టీజ్ ఎస్టేట్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, మదర్సన్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఆయిల్ ఇండియా, నాల్కో, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, సన్ ఫార్మ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1843 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 2473 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 92.55గా ఉంది.


ఇవి కూడా చదవండి..

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..


ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..

Updated Date - Apr 08 , 2026 | 10:14 AM