Share News

స్థానిక ఎన్నికలపై సుప్రీంలో వైసీపీ పిటిషన్‌

ABN , Publish Date - Oct 06 , 2026 | 04:41 AM

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. రాష్ట్రంలో వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్‌), ఓటర్ల జాబితా ఖరారుపై ఏపీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

స్థానిక ఎన్నికలపై సుప్రీంలో వైసీపీ పిటిషన్‌

  • ‘సర్‌’ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆపాలని వినతి

  • శుక్రవారం విచారిస్తామన్న సీజేఐ ధర్మాసనం

న్యూఢిల్లీ, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. రాష్ట్రంలో వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్‌), ఓటర్ల జాబితా ఖరారుపై ఏపీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడాన్ని స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో సవాల్‌ చేసింది. వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి, కడప మాజీ మేయర్‌ పాకా సురేశ్‌ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు.. న్యాయవాది మహ్ఫూజ్‌ ఎ. నజ్కి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏపీలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ‘సర్‌’ ఇంకా కొనసాగుతోందని, ఈ ప్రక్రియ పూర్తయి, తుది జాబితా ఖరారైన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ల తరఫున ఆయన విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్నదని, అత్యవసరంగా ఈ కేసును విచారించాలని విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. శుక్రవారం వాదనలు వింటామని తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 04:41 AM