Share News

లక్షలాది మంది ఉపాధి దెబ్బతీసేందుకే జగన్ కుట్రలు: యనమల

ABN , Publish Date - Jul 16 , 2026 | 01:31 PM

ఆక్వా రంగంపై జగన్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కౌంటర్ ఇచ్చారు. జగన్ ఆక్వా రంగాన్ని నాశనం చేస్తూ, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావాలను అవగాహన చేసుకోకుండా ప్రజల ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

లక్షలాది మంది ఉపాధి దెబ్బతీసేందుకే జగన్ కుట్రలు: యనమల
Yanamala Ramakrishnudu

అమరావతి, జులై 16: ఆక్వా రంగంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ ఆక్వా రంగాన్ని పూర్తిగా నాశనం చేయాలని కోరుకుంటున్నారని, తద్వారా ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ప్రజలకు ఉపాధి అవకాశాలు లేకుండా చేయాలన్నదే ఆయన ప్రధాన ఉద్దేశమని ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్లు ఎప్పటికప్పుడు మారుతూ దేశీయ మార్కెట్‌పై చూపే గణనీయమైన ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని యనమల ఎద్దేవా చేశారు.


గతంలో అధికారంలో ఉన్నప్పుడు సమగ్ర ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీసి.. ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన ఘనత జగన్‌దేనని యనమల దుయ్యబట్టారు. నాడు అధికారంలో ఉన్న సమయంలో ఆక్వా రంగానికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు, రాయితీలను తొలగించడం ద్వారా ఈ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లు వృద్ధి చెందుతున్నప్పటికీ రాష్ట్రంలో ఆక్వా రంగం ఎందుకు భారీగా క్షీణించిందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకనైనా జగన్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అడ్డంకిగా మారకుండా, బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా వ్యవహరించాలని యనమల హితవు పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రికార్డు స్థాయిలో పసుపు ధర

20 రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 02:08 PM