Share News

కన్నకొడుకును హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణమిదే?

ABN , Publish Date - Jul 16 , 2026 | 08:09 AM

గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం చోటుచేసుకుంది. నిత్యం మద్యం తాగి వచ్చి వేధిస్తున్న కుమారుడిని తల్లిదండ్రులే హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

కన్నకొడుకును హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణమిదే?
Tenali Parents Incident

గుంటూరు జిల్లా: తెనాలిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిత్యం మద్యం తాగి వచ్చి తమను వేధిస్తున్న కుమారుడిని తల్లిదండ్రులే హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.


పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. తెనాలి పట్టణంలోని నాజర్‌పేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో గొడవ పడుతూ వారిని వేధించేవాడు. అతని వేధింపులు రోజురోజుకూ పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లిదండ్రులు చివరకు కుమారుడి గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది.


సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, కుటుంబంలో జరిగిన పరిణామాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో నాజర్‌పేట ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొనగా, స్థానికులు షాక్‌కు గురయ్యారు. పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.


Also Read:

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..

హైదరాబాద్‌లో వైభవంగా ఆషాఢ బోనాలు.. సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

Updated Date - Jul 16 , 2026 | 08:15 AM