Share News

పర్యాటక శోభ ఉట్టిపడేలా.. ప్రపంచ పర్యాటక దినోత్సవాలు: మంత్రి కందుల దుర్గేశ్

ABN , Publish Date - Sep 23 , 2026 | 07:40 PM

ప్రపంచ పర్యాటక దినం సందర్భంగా రాజమహేంద్రవరంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు.

పర్యాటక శోభ ఉట్టిపడేలా.. ప్రపంచ పర్యాటక దినోత్సవాలు: మంత్రి కందుల దుర్గేశ్
tourism minister kanula durgesh

అమరావతి, సెప్టెంబర్ 23: ఈ నెల (సెప్టెంబర్)27వ తేదీన ప్రపంచ పర్యాటక దినం సందర్భంగా రాజమహేంద్రవరంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఈ మేరకు వెలగపూడి సచివాలయంలో పర్యాటక శాఖాధికారులతో మంత్రి సుదీర్ఘ భేటీ నిర్వహించారు. పర్యాటక దినోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.


రాష్ట్రంలో రానున్న గోదావరి పుష్కరాల్లో పర్యాటక శాఖ తరఫున చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు మంత్రి దుర్గేశ్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి ఇన్-బౌండ్ టూరిస్ట్‌ల రాకను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. దీనికోసం దేశవిదేశాల్లో రోడ్ షోలు నిర్వహించాలన్నారు. ఏడాదంతా పర్యాటక శోభ ఉట్టిపడేలా.. రాష్ట్రంలో పర్యాటక ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి దుర్గేశ్ ఆదేశించారు.


సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల నేతృత్వంలో.. కేంద్ర సహకారంతో ఏపీని దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. కేంద్రం ద్వారా మరిన్ని నిధులు రాబట్టాలని.. ఈ మేరకు కొత్త పర్యాటక ప్రాజెక్టులకు డీపీఆర్‌లు సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు చేశారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కందుల దుర్గేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

విశాఖలో భారీ వర్షం.. అప్రమత్తమైన యంత్రాంగం

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 09:52 PM