Share News

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ దుర్ఘటన అత్యంత దురదృష్టకరం: కేంద్ర మంత్రి

ABN , Publish Date - Jun 08 , 2026 | 09:01 PM

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన దుర్ఘటన అత్యంత దురదృష్టకరమైనదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. సోమవారం సాయంత్రం భీమవరంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఆయన స్పందించారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ దుర్ఘటన అత్యంత దురదృష్టకరం: కేంద్ర మంత్రి
Central Minister Srinivas Verma

భీమవరం, జూన్08: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన దుర్ఘటన అత్యంత దురదృష్టకరమైనదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. సోమవారం సాయంత్రం భీమవరంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లిక్విడ్‌‌ను 1500 డిగ్రీల సెల్సియస్‌తో వేడి చేశారని తెలిపారు. దీనిని లాడెల్‌లో 150 టన్నుల లిక్విడ్‌ను నంబర్ 2 మిషన్ వద్దకు తరలించే సమయంలో ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు.


ఈ ప్రమాదంలో 8 మంది మరణించారన్నారు శ్రీనివాసవర్మ. పక్క మిషన్ వద్ద ఉన్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని.. నలుగురి పరిస్థితి బాగానే ఉందని తమకు సమాచారం అందిందన్నారు. వారికి మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్ సిద్ధం చేశామని చెప్పారు. సోమవారం రాత్రికి తనతోపాటు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి విశాఖపట్నం చేరుకుంటామని వివరించారు.


ఈ ప్రమాదానికి ప్రత్యేకమైన కారణం లేదని చెప్పారు. స్టీల్ తయారీలో ఇదొక ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఏ విధంగా పేలుడు సంభవించింది? లాండిల్‌పై నుంచి తరలించే సమయంలో అక్కడ ఏమైనా లింక్ తెగిందా అనే విషయాన్ని తెలుసుకుంటామని తెలిపారు. అయితే ప్రస్తుతానికి అక్కడికి వెళ్లే పరిస్థితి లేదని ఉన్నతాధికారులు తమకు తెలిపారని చెప్పారు. ప్లాంట్‌లోని ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలకు మనమంతా భరోసా ఇవ్వాల్సి ఉందని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పర్యాటక రంగం ద్వారా ఉపాధి, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు: మంత్రి జూపల్లి

పరేడ్ గ్రౌండ్స్ వేదికగా మహిళా శక్తికి 553 ఆర్టీసీ బస్సుల పంపిణీ

For More AP News And Telugu News

Updated Date - Jun 08 , 2026 | 09:17 PM