రేపే నీట్ యూజీ
ABN , Publish Date - May 02 , 2026 | 12:59 AM
తాడేపల్లిగూడెం రూరల్/ ఏలూరు అర్బన్, మే 1(ఆంధ్ర జ్యోతి): దేశ వ్యాప్తంగావున్న వైద్య కళాశాలలు, దంత వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ (బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ ఎంఎస్) కోర్సులు, బీఎస్సీ(నర్సింగ్)లో ప్రవేశాలకు ఈ నెల 3న నిర్వహించనున్న నీట్ యూజీ–2026 పరీక్షలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవ రం, తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లో ఏర్పా ట్లు పూర్తయ్యాయి.
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రన్స్
తాడేపల్లిగూడెం రూరల్/ ఏలూరు అర్బన్, మే 1(ఆంధ్ర జ్యోతి): దేశ వ్యాప్తంగావున్న వైద్య కళాశాలలు, దంత వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ (బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ ఎంఎస్) కోర్సులు, బీఎస్సీ(నర్సింగ్)లో ప్రవేశాలకు ఈ నెల 3న నిర్వహించనున్న నీట్ యూజీ–2026 పరీక్షలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవ రం, తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లో ఏర్పా ట్లు పూర్తయ్యాయి. ఏలూరులో ఆరు కేంద్రాల్లో 1680 మంది, పశ్చిమలో ఆరు కేంద్రాల్లో 2270 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో..
భీమవరం డీఎన్‌ఆర్ కళాశాల రెండు సెంటర్లలో 900 మంది, తాడేపల్లిగూడెం ఏపీ నిట్ రెండు సెంటర్లలో 670 మంది, తణుకు బాయిస్, గరల్స్ హైస్కూల్స్‌లో 700 మంది పరీక్షలు రాయను నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ పశ్చిమ గోదావరి కో ఆర్డినేటర్‌గా నక్కా జయరాం తెలిపారు.
ఏలూరు జిల్లాలో..
ఏలూరు కోటదిబ్బ కస్తూరిబా మున్సిపల్ బాలికోన్నత పాఠశాల, గోపన్నపాలెం పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ, కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాల, సుబ్బమ్మదేవి మున్సి పల్ హైస్కూలు, గాంధీనగర్
మున్సిపల్ హైస్కూలు, గోపన్నపాలెం ప్రభుత్వ హైస్కూలులో నీట్ యూజీ పరీక్ష కేంద్రాలు ఏర్పా టు చేసినట్లు సిటీ కో–ఆర్డినేటర్ గోపన్నపాలెం కేం ద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ బూర్‌సింగ్ మీనా తెలిపారు.
11 గంటల నుంచే చెకింగ్
ఆదివారం మధ్యాహ్నం రెండు నుంచి సాయం త్రం ఐదు గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను తనిఖీ లు చేసి, బయోమెట్రిక్ ద్వారా సెంటర్లలోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభ సమయానికి అర గంట ముందు మధ్యాహ్నం ఒంటి గంట న్నరకు పరీక్ష కేంద్రం మెయిన్‌గేట్ మూసివేస్తా రు. ఆ తర్వాత అభ్యర్థులను ఒక్క నిమిషం ఆల స్యమైనా అనుమతించరు.
24 మంది విద్యార్థులకు ఒక రూమ్ కేటాయి స్తారు. ప్రతీ 12 మందికి ఒక ఇన్విజిలేటర్, ప్రతీ సెంటర్‌కు ఇద్దరు అబ్జర్వర్‌లు ఉంటారు.
అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు, పాస్ పోర్టు సైజు ఫోటో అతికించిన సెల్ప్ డిక్లరేషన్ ఫారం, అటెండెన్సు షీట్‌పై అతికించేందుకు పాస్‌పోర్టు సైజు ఫొటో మరొకటి, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు (ఆధార్/ఓటర్ ఐడి/పాన్ కార్డు)ను వెంట తెచ్చుకోవాలి. పరీక్షకు దరఖాస్తు చేసినపుడు అప్‌లోడ్ చేసిన ఫొటోలను తీసుకెళ్లడం ఉత్తమం.
అడ్మిట్ కార్డుపై ముద్రించిన సూచనలు, జాగ్రత్తలను క్షుణ్ణంగా చదివి పాటించాలి. అప్‌డేటెడ్ ఆధార్ కార్డు మాత్రమే తెచ్చుకోవాలి.
మొబైల్ ఫోన్లు, ఎలకా్ట్రనిక్ వాచీలు, కాలిక్యులేటర్లు, పర్సులు, ఎలాంటి మెటాలిక్ వస్తువులను అనుమతించరు. డ్రెస్ కోడ్‌ను విధిగా పాటించాలి. ఫార్మల్ దుస్తులు ధరించడం శ్రేయస్కరం. ఫుల్ హ్యాండ్స్ షర్టులు వద్దు. పెద్ద బటన్లు వున్న దుస్తులు, బూట్లు, చెవి పోగులు, జడ క్లిప్పులు, ఉంగరాలు, గొలుసులు, ముక్కు పుడకలు ఉండకూడదు.
పాదరక్షలు సాధారణ స్లిప్పర్లు లేదా సన్నని సోల్ వున్న శాండల్స్ ధరించడం మంచిది.