Share News

గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఆగంతుకులు

ABN , Publish Date - May 02 , 2026 | 01:05 AM

చాట్రాయి మండలంలోని పోలవరం సెంటర్‌లో గల గాంధీజీ విగ్రహాన్ని గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. విగ్రహం కాళ్లు పెచ్చులూడి ఊచలు బయటకు వచ్చాయి.

గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఆగంతుకులు
కాళ్ల వద్ద ధ్వంసం చేసిన దృశ్యం

చాట్రాయి, మే 1(ఆంధ్రజ్యోతి): చాట్రాయి మండలంలోని పోలవరం సెంటర్‌లో గల గాంధీజీ విగ్రహాన్ని గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. విగ్రహం కాళ్లు పెచ్చులూడి ఊచలు బయటకు వచ్చాయి. దీనితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్ప డ్డాయి. సమాచారం తెలియగానే నూజివీడు రూరల్‌ సీఐ కె. రామకృష్ణ, ఇన్‌చార్జి ఎస్సై చిరంజీవి సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామన్నారు. సుమారు 60 ఏళ్ళ క్రితం ఇక్కడ గాంధీజీ విగ్రహాన్ని, 40 ఏళ్ళ క్రితం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, దీనికి గాంధీ సెంటర్‌ అని పేరు వచ్చింది. మూడు రోడ్ల సెంటర్‌లో ఉన్న గాంధీ విగ్రహాలను రహదారి పక్కకు మార్చి, అక్కడ బొడ్డురాయి ఏర్పాటు చెయ్యాలని కొద్ది నెలల క్రితం గ్రామంలో ఒక వర్గం ప్రతిపాదించగా మరో వర్గం దీనిని వ్యతిరేకించింది. అప్పట్లో పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా దెబ్బతిన్న గాంధీజీ విగ్రహానికి స్థానికులు మరమ్మతులు ప్రారంభించారు.

Updated Date - May 02 , 2026 | 01:05 AM