Share News

పురుగు మందు తాగి ఆత్మహత్య

ABN , Publish Date - May 08 , 2026 | 12:30 AM

గజపతినగ రం దావాలపేట పరిధిలోగల మహంకాళీ అమ్మవారి గుడి సమీ పంలో పురుగు మందు తాగి, చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.

పురుగు మందు తాగి ఆత్మహత్య

గజపతినగరం/ దత్తిరాజేరు, మే 7(ఆంధ్రజ్యోతి): గజపతినగ రం దావాలపేట పరిధిలోగల మహంకాళీ అమ్మవారి గుడి సమీ పంలో పురుగు మందు తాగి, చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు గురు వారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దత్తిరాజేరు మండలం ఎం.లింగాలవ లస గ్రామానికి చెందిన మజ్జి ఈశ్వరరావు(37) రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ జీనవం సాగిస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పుల బాధలు తట్టుకో లేక మనస్తాపానికి గురై ఈనెల 5వ తేదీన మహంకాళీ అమ్మవారి గుడి సమీ పంలో ఉన్న శ్మశానవాటిక వద్ద పురుగు మందు తాగారు. గజపతినగరం చంపా వతి వంతెనకు సమీపం లోగల శ్రీనివాస లాడ్జి వద్దకు చేరుకునేసరికి వాంతులు రావడంతో తన మిత్రుడై న రామకృష్ణకు ఫోన్‌ చేసి, పురుగు మందు తాగినట్లు సమాచారం అందజేశారు. మిత్రుడు.. ఈశ్వరరావును దగ్గరలోగల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిసి ్థతి విషమించడంతో జిల్లా కేంద్రంలోగల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున ఆయన మృతిచెందారు. మృతుడి తం డ్రి అప్పలనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - May 08 , 2026 | 12:30 AM