భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని.. షెడ్యూల్ ఇదిగో..
ABN , Publish Date - Jul 26 , 2026 | 06:53 PM
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఆగస్టు 1వ తేదీన (శనివారం) విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
అమరావతి, జులై 26: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఆగస్టు 1వ తేదీన (శనివారం) విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో భోగాపురంలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఉదయం10:45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు.
షెడ్యూల్ వివరాలివే..
ఆగస్టు 1వ తేదీన ఉదయం 10:45 – 10:50 గంటలకు ప్రధాని మోదీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఏపీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడితోపాటు, రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారు.
10:50 – 10:55: కారులో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి ప్రధాని మోదీ చేరుకుంటారు.
10:55 – 10:58: దాదాపు 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలకనున్నారు.
11:00 – 11:15: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను ప్రధాని మోదీ పరిశీలిస్తారు.
11:17 – 11:25: టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ జీప్‌లో బహిరంగ సభా వేదికకు ప్రధాని మోదీ చేరుకుంటారు.
11:30 – 12:55: విమానాశ్రయం ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 1:05 – 1:10: భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి ప్రధాని మోదీ తిరుగు ప్రయాణం కానున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం: ఏపీ టీడీపీ చీఫ్
హైదరాబాద్‌లో నందమూరి బాలకృష్ణను పరామర్శించిన సీఎం చంద్రబాబు
For More AP News And Telugu News