ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం: ఏపీ టీడీపీ చీఫ్
ABN , Publish Date - Jul 26 , 2026 | 06:13 PM
ఎన్డీయే అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
అమరావతి, జులై 26: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రేపటి (27-06-2026) నుంచి ‘ఇంటింటికి తెలుగుదేశం పార్టీ’ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. మొత్తం 45 రోజుల పాటు ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతుందని చెప్పారు. ఆదివారం మంగళగిరిలోని కార్యాలయంలో పార్టీ కేడర్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమాన్ని క్షేత్రస్థాయిలో ఇంటింటికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీసుకెళ్లాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వ సహాయం, మిత్రపక్షాల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సూపర్-6 హామీల అమలు, మహిళలు, రైతులు, యువత, విద్యార్థులకు అందిన లబ్ధిని ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు.
గత ప్రభుత్వ విధ్వంసకర పాలనకు, ఎన్డీయే ప్రభుత్వ అభివృద్ధి పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. ప్రజల సమస్యలు, సూచనలను నమోదు చేసి.. వాటి పరిష్కారానికి పార్టీ, ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకునేలా కృషి చేయాలని పార్టీ కేడర్‌కు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ అభివృద్ధిలో గేమ్ చేంజర్ కాబోతున్న బుల్లెట్ ట్రైన్లు: కిషన్ రెడ్డి
హైదరాబాద్‌లో నందమూరి బాలకృష్ణను పరామర్శించిన సీఎం చంద్రబాబు
For More AP News And Telugu News