హైదరాబాద్‌లో నందమూరి బాలకృష్ణను పరామర్శించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 26 , 2026 | 05:00 PM
హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. బాలయ్య ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆయన అడిగి తెలుసుకున్నారు.
హైదరాబాద్, జులై 26: నగరంలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. బాలయ్య ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆయన అడిగి తెలుసుకున్నారు. జులై 21న కాకినాడ పోర్ట్‌లో సినిమా షూటింగ్ సందర్భంగా బాలకృష్ణ గాయపడిన సంగతి తెలిసిందే. ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లోకి రక్తం చేరడంతో వాపు ఏర్పడింది. ఈ విషయాన్ని ఏఐజీ వైద్యులు గుర్తించి.. శస్త్ర చికిత్స చేశారు. అనంతరం బాలయ్య కోలుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఏఐజీలో వెళ్లి.. బాలకృష్ణను సీఎం చంద్రబాబు పరామర్శించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
ఇస్నాపూర్‌లో అదృశ్యమైన బాలికలు సురక్షితం: పటాన్‌చెరు పోలీసులు
ఆటో రైట్ టర్న్.. ఎదురుగా దూసుకొచ్చిన బస్సు.. తర్వాత ఏం జరిగిందంటే ?
For More TG News And Telugu News