Share News

ఆటో రైట్ టర్న్.. ఎదురుగా దూసుకొచ్చిన బస్సు.. తర్వాత ఏం జరిగిందంటే ?

ABN , Publish Date - Jul 26 , 2026 | 03:36 PM

రహదారిపై వాహనం నడుపుతున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. పెద్ద ప్రమాదమే జరుగుతుంది. అలాంటి ప్రమాదాలు ప్రతిరోజూ ఎన్నింటినో చూస్తుంటాం. ట్రాఫిక్ నియమాలు పాటించకపోయినా.. అతి వేగంతో వాహనం నడిపినా.. రెప్ప పాటులో పెద్ద ప్రమాదమే జరుగుతుంది.

ఆటో రైట్ టర్న్.. ఎదురుగా దూసుకొచ్చిన బస్సు.. తర్వాత ఏం జరిగిందంటే ?

ఇంటర్నెట్ డెస్క్: రహదారిపై వాహనం నడుపుతున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. పెద్ద ప్రమాదమే జరుగుతుంది. అలాంటి ప్రమాదాలు ప్రతిరోజూ ఎన్నింటినో చూస్తుంటాం. ట్రాఫిక్ నియమాలు పాటించకపోయినా.. అతి వేగంతో వాహనం నడిపినా.. రెప్ప పాటులో పెద్ద ప్రమాదమే జరుగుతుంది. కానీ వేగంగా ప్రధాన రహదారిపైకి పైకి వచ్చిన ఆటో.. టర్న్ తీసుకుంటుంది. అదే సమయంలో బస్సు వేగంగా వచ్చింది. కానీ సెకన్ కాలంలో బస్సుకు, ఆటోకు ఏం కాలేదు. ఆ వీడియో వైరల్ అవుతోంది.


టీ జంక్షన్ వద్ద చిన్న రోడ్డు నుంచి ఆటో ప్రధాన రహదారిపైకి వచ్చింది. ఆటోను రైట్ టర్న్ తీసుకునేందుకు డ్రైవర్ యత్నించాడు. అదే సమయంలో ఆర్టీసీ బస్సు వేగంగా ఎదురు వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్.. ఆటోను లెఫ్ట్ టర్న్ చేశాడు. ఇంతలో ఆర్టీసీ బస్సు వేగంగా ముందుకు దూసుకొచ్చింది. ఆటోను రహదారి పక్కన డ్రైవర్ ఆపాడు. బస్సును రోడ్డుపై డ్రైవర్ ఆపేశాడు. ఆ తర్వాత బస్సు ముందుకు సాగి పోగా.. ఆటో మాత్రం రైట్ టర్న్ తీసుకుని ముందుకు సాగిపోయింది. ఇదంతా రహదారి పక్కనే ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయింది.


ఈ వీడియోను @pradeep39192398 అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. రోడ్డుపై చిన్న అజాగ్రత్త.. జీవితాంతం పశ్చాత్తాపానికి దారి తీయవచ్చు అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆటోను బస్సు ఢీకొని ఉంటే.. పెద్ద ప్రమాదమే జరిగేదని చెబుతున్నారు. రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు అన్ని వైపులా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ రోజు అదృష్టం మనవైపు ఉంది. అందుకు పెద్ద ప్రమాదం తప్పిందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు ఆటో డ్రైవర్ కారణమని నెటిజన్లు స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తే.. ఎలాంటి ప్రమాదాలు జరగవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 26 , 2026 | 03:50 PM