Share News

చకచకా ఏర్పాట్లు

ABN , Publish Date - Jul 29 , 2026 | 10:04 AM

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించనుండటంతో రాష్ట్రంతో పాటు ఉత్తరాంధ్ర వాసుల అందరి చూపు భోగాపురంపైనే ఉంది.

చకచకా ఏర్పాట్లు
Bhogapuram International Airport

  • విమానాశ్రయ ప్రారంభోత్సవ పనులకు తుదిమెరుగులు

విజయనగరం: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించనుండటంతో రాష్ట్రంతో పాటు ఉత్తరాంధ్ర వాసుల అందరి చూపు భోగాపురంపైనే ఉంది. సమయం దగ్గర పడుతుండడంతో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు పెండింగ్‌ కనెక్టివిటీ రోడ్ల పనులు పూర్తిచేయడానికి వేలాది మంది కార్మికులు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు.


pm.jpgశుక్రవారానికే అన్ని పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన 11 మంది మంత్రులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఈ బృందంలో ఉన్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి లోకేశ్‌ అధికారులకు సూచనలు చేస్తూ పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రారంభోత్సవ సభకు 2.10 లక్షల మంది వస్తారన్న అంచనాతో ఏర్పాటు చేస్తున్నారు. విజయనగరం నుంచి 88 వేల మంది, విశాఖ నుంచి 66 వేల మంది, శ్రీకాకుళం నుంచి 35 వేల మంది, అనకాపల్లి నుంచి 12,500 మంది, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 7,500 మంది, అల్లూరి జిల్లా నుంచి 2 వేల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


వీరి కోసం 4,759 బస్సులు ఏర్పాటుచేశారు. ఆరు జిల్లాల నుంచి వచ్చే వాహనాల కోసం వేర్వేరుగా పార్కింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం బయలుదేరినప్పుడే బస్సుల్లోనే అల్పాహారం అందిస్తారు. మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో ప్రత్యేక బాక్సుల్లో భోజనం సమకూర్చుతారు. పారిశుధ్యం, తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పనను జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, రాజమండ్రి కమిషనర్‌ రాహుల్‌మీనా, విజయవాడ కమిషనర్‌ ధ్యానచంద్ర, గుంటూరు కమిషనర్‌ అశోక్‌ చూడనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

బొండా ఉమా వివరణతో సంతృప్తి చెందిన అధిష్ఠానం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 10:09 AM