రాజాంలో రెచ్చిపోయిన దొంగలు... బంగారం, వెండి ఎత్తుకెళ్లి..
ABN , Publish Date - Feb 02 , 2026 | 07:30 PM
విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో దొంగలు హల్ చల్ చేశారు. సామాన్యులే కాదు, హై ప్రొఫైల్ నివాసాలను కూడా టార్గెట్ చేసుకుని ఒకే రాత్రి రెండు ఇండ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..
విజయనగరం: రాజాం పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. ఒకే రాత్రి రెండు ఇళ్లలో దొంగతనానికి పాల్పడి భారీగా బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు దొంగలు. స్థానిక జీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలోని డాక్టర్స్ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం అర్థరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. డాక్టర్ నగేష్ ఇంట్లో 1,250 గ్రాముల బంగారం, కిలో వెండి వస్తువులు చోరీ చేశారు. అదే ప్రాంతంలో ఉంటున్న ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ మాధవ కృష్ణ ఇంట్లోనూ చోరీకి పాల్పడిన దొంగలు. ఆయన ఇంట్లో 25 తులాల బంగారం దోచుకెళ్లారు.
డాక్టర్ నగేశ్ కుటుంబం విశాఖలో ఉంటుంది. శనివారం విధులు ముగించుకొని విశాఖ వెళ్లారు. ఇదే అదునుగా దొంగలు ఇంటి తాళం తొలగించి బీరువాలోని వెండి, బంగారు నగలు దోచుకు వెళ్లారు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిస్థితిని పరిశీలించారు. పోలీసులు ఘటనా స్థలంలో క్లూస్ టీమ్‌తో దర్యాప్తు చేపట్టారు. ఈ రెండు ఘటనలు జిల్లాలో తీవ్ర కలకలం రేపాయి.
ఇవి కూడా చదవండి..
లండన్‌కు మంత్రి నారాయణ.. కీలక ప్రాజెక్టుల పరిశీలన
సీఎంను తిట్టడం ప్రజాస్వామ్య విరుద్ధం.. అంబటిపై శ్రీనివాస్ వర్మ ఆగ్రహం
Read Latest AP News And Telugu News