Share News

సనాతన ధర్మాన్ని కించపరిచేలా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు: శ్రీనివాసానంద సరస్వతి

ABN , Publish Date - Jul 07 , 2026 | 12:45 PM

మతాల మధ్య చిచ్చుపెట్టాలని వైసీపీ చూస్తోందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. ప్రశ్న రావణ్, జడ శ్రవణ్ కుమార్, ప్రకాశ్ రాజ్.. ప్రతిరోజూ హిందువులపై విషాన్ని చిమ్ముతున్నారని మండిపడ్డారు.

సనాతన ధర్మాన్ని కించపరిచేలా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు: శ్రీనివాసానంద సరస్వతి
Srinivasananda Saraswati

విశాఖపట్నం, జులై 7: మతాల మధ్య చిచ్చుపెట్టాలని వైసీపీ చూస్తోందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. ప్రశ్న రావణ్, జడ శ్రవణ్ కుమార్, ప్రకాశ్ రాజ్.. ప్రతిరోజూ హిందువులపై విషాన్ని చిమ్ముతున్నారని మండిపడ్డారు. హిందూ వ్యతిరేకంగా ఉన్నవారందరికీ వైసీపీ న్యాయ సహాయం చేస్తోందన్నారు. హిందువుల పేర్లు పెట్టుకుని సనాతన ధర్మాన్ని కించపరిచేలా నటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


హిందువుల ఆరాధ్య దైవాలను కించపరిచే హక్కు ఎవరిచ్చారని స్వామీజీ ప్రశ్నించారు. ప్రభుత్వం.. తప్పులు చేస్తున్న వారిని చట్టప్రకారం అరెస్టు చేస్తుంటే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో జరిగిన తప్పులను ఎత్తి చూపినందుకే తమను టార్గెట్ చేశారన్నారు. హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ చేస్తున్న వ్యాఖ్యల వెనుక వైసీపీ కుట్ర ఉందని స్వామి శ్రీనివాసానంద ఆరోపించారు.


తమిళనాడు సీఎంపై ప్రశంసలు

తమిళనాడు సీఎం విజయ్‌పై స్వామి శ్రీనివాసానంద సరస్వతి ప్రశంసలు కురిపించారు. హిందూ ఆలయాల నుంచి వచ్చే నిధులను ఆలయాల అభివృద్ధి కోసమే వాడుతామని తమిళనాడు సీఎం తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. విజయ్ నిర్ణయాన్ని తాము సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని చెప్పారు. హిందూ ఆలయాల నిధులను ఇతర అవసరాల కోసం మళ్లించకూడదని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు కూడా తమిళనాడు సీఎం తీసుకున్న నిర్ణయమే తీసుకోవాలని స్వామీజీ కోరారు.


ఆ ముసుగులో హిందుత్వంపై దాడులు: శ్రీరామ్

ప్లాన్ ప్రకారమే సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లపై దాడులు చేస్తున్నారని హిందూ సంఘాల నేత తురగా శ్రీరామ్ అన్నారు. ఏపీలో రిజర్వేషన్ల జిహాద్ జరుగుతోందని ఆరోపించారు. రిజర్వేషన్లను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రిజర్వేషన్లు లాక్కునేవారి వెనుక నాయకులు ఉన్నారని వ్యాఖ్యానించారు. కొంతమంది యూట్యూబర్, జర్నలిస్టుల ముసుగులో హిందుత్వంపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్న రావణ్‌కు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మద్దతు ఇస్తున్నారంటే అర్ధం ఏంటి అని శ్రీరామ్ ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి...

లోకేశ్ దక్షిణ కొరియా పర్యటన.. హ్యుందాయ్ మోబిస్, అపాక్ట్ సీఈవోతో భేటీ

31 శాఖల్లో పెండింగ్‌ కేసులు.. సీఎస్ కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 01:12 PM