Share News

రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య..​ 33 పేజీల సూసైడ్ నోట్

ABN , Publish Date - Jul 07 , 2026 | 10:47 AM

జనగామ జిల్లాలో రిటైర్డ్ ఉపాధ్యాయుడి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. జనగామ పట్టణంలోని పూర్ణిమ కాలనీకి చెందిన పగిడిపల్లి మల్లయ్య అనే రిటైర్డ్ టీచర్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య..​ 33 పేజీల సూసైడ్ నోట్
Jangaon News

జనగామ, జులై 7: జిల్లాలో రిటైర్డ్ ఉపాధ్యాయుడి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. జనగామ పట్టణంలోని పూర్ణిమ కాలనీకి చెందిన పగిడిపల్లి మల్లయ్య అనే రిటైర్డ్ టీచర్ ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. చనిపోయే ముందు తన చావుకు కారణమైన వారి పేర్లతో మల్లయ్య సూసైడ్ నోట్ రాశారు. మొత్తం 33 పేజీల సూసైడ్ నోట్‌ను రాసి చనిపోయారు. రిటైర్డ్ టీచర్ రాసిన నోట్‌లో బావమర్దులు గుంటి రత్నాకర్, మనోహర్ పేర్లు ఉన్నాయి. వీరిద్దరి వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మల్లయ్య లెటర్‌లో రాశారు.


సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు మల్లయ్య రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసుల విచారణ కొనసాగనుంది. మల్లయ్య మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

లోకేశ్ దక్షిణ కొరియా పర్యటన.. హ్యుందాయ్ మోబిస్, అపాక్ట్ సీఈవోతో భేటీ

ఏబీఎన్‌ ఎఫెక్ట్.. వరంగల్ ముంపు ప్రాంతాల్లో కొండా మురళీ పర్యటన

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 10:54 AM