Share News

హోర్ముజ్‌లో మరోసారి ఉద్రిక్తత.. నౌకలపై ఇరాన్ దాడులు..

ABN , Publish Date - Jul 07 , 2026 | 08:11 AM

హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. హోర్ముజ్‌లో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ రెవల్యూషనరీ కార్ప్స్ గార్డ్స్ దాడులు చేసింది.

హోర్ముజ్‌లో మరోసారి ఉద్రిక్తత.. నౌకలపై ఇరాన్ దాడులు..
Strait of Hormuz

ఇంటర్‌నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. హోర్ముజ్‌లో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ రెవల్యూషనరీ కార్ప్స్ గార్డ్స్ దాడులు చేసింది. రెండు నౌకలపై మిస్సైల్స్ ప్రయోగించింది. ఈ దాడుల్లో రెండు నౌకలు దెబ్బ తిన్నాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ విషయాన్ని అమెరికా అధికారులు మీడియాకు వెల్లడించారు. కాగా, మూడు వారాల క్రితం అమెరికా, ఇరాన్ దేశాలు మెమొరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్‌పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం హోర్ముజ్ జలసంధిలో దాడులు ఆపేస్తామని ఇరాన్ ప్రకటించింది.


రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఇరాన్ దాడులకు పాల్పడటంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరో ఘటనలో.. ఒమన్‌లోని లిమా తీరంలో దక్షిణ దిశగా ప్రయాణిస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్‌ను పేలుడు వస్తువు బలంగా ఢీకొట్టింది. దీని కారణంగా ఆ నౌక ఎడమ వైపు భాగంలో భారీగా మంటలు చెలరేగాయి. బ్రిటీష్ మిలిటరీకి చెందిన 'యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్' ఈ ప్రమాదాన్ని అధికారికంగా ధ్రువీకరిస్తూ ప్రకటన విడుదల చేసింది.


ఇవి కూడా చదవండి

యోగా చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందా?

డీఎస్పీ భీమ్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్, చంచల్‌గూడ జైలుకు తరలింపు!

Updated Date - Jul 07 , 2026 | 08:44 AM