Share News

ఏబీఎన్‌ ఎఫెక్ట్.. వరంగల్ వరద ముప్పు ప్రాంతాల్లో కొండా మురళీ పర్యటన

ABN , Publish Date - Jul 07 , 2026 | 10:11 AM

వరంగల్‌కు ముంపు భయంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రసారం అయిన విషయం తెలిసిందే. దీనిపై వెంటనే స్పందించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించారు.

ఏబీఎన్‌ ఎఫెక్ట్.. వరంగల్ వరద ముప్పు ప్రాంతాల్లో కొండా మురళీ పర్యటన
Konda Murali

వరంగల్, జులై 7: వరంగల్‌కు ముంపు భయంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రసారం అయిన విషయం తెలిసిందే. దీనిపై వెంటనే స్పందించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈరోజు(మంగళవారం) ఉదయం పర్యటించారు. ప్రధానంగా వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలైనా ఏసీ రెడ్డి నగర్, మైసయ్యనగర్ ప్రాంతాలను పరిశీలించారు. వరదలొస్తే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచన చేశారు.


అనంతరం ఏబీఎన్‌తో మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ... వరంగల్ ముంపుపై మీడియాలో వస్తున్న కథనాలు చూశానని.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీతోనే ముంపు సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. మంత్రి కొండా సురేఖతో త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలోనే నాలాలు, చెరువులు కబ్జా అయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కబ్జాలు జరగలేదని తెలిపారు. కబ్జాల నుంచి నాలాలు, చెరువులను కాపాడుతామని అన్నారు. ‘నన్ను కొండా సురేఖ భర్త అని సంభోదించవద్దు. నేను ఇప్పటి వరకూ సెక్రటేరియట్‌లో కాలుపెట్టలేదు. కొండా సురేఖ అధికారిక వాహనంలో ప్రయాణం చేయలేదు’ అని కొండా మురళీ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

క్రాంతికుమార్ ఆత్మహత్య ఉదంతంలో సీఐ నాగరాజుపై మరో కేసు

లోకేశ్ దక్షిణ కొరియా పర్యటన.. హ్యుందాయ్ మోబిస్, అపాక్ట్ సీఈవోతో భేటీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 10:53 AM