లోకేశ్ దక్షిణ కొరియా పర్యటన.. హ్యుందాయ్ మోబిస్, అపాక్ట్ సీఈవోతో భేటీ
ABN , Publish Date - Jul 07 , 2026 | 09:37 AM
ఏపీకి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
దక్షిణ కొరియా/అమరావతి, జులై 7: ఏపీకి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. హ్యుందాయ్ మోబిస్ ఉన్నతస్థాయి ప్రతినిధులతో లోకేశ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈవీ సెమీకండక్టర్స్ హబ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో హ్యుందాయ్ మోబిస్ ఆర్ అండ్ డీ/ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తిరుపతి–అనంతపురం ప్రాంతంలో ఈవీ కాంపోనెంట్స్, బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు. ఐఐటీ తిరుపతితో కలిసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అటానమస్ డ్రైవింగ్, ADAS, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశోధనలకు హ్యుందాయ్ మోబిస్‌తో భాగస్వామ్యం కోరారు మంత్రి. అనంతపురాన్ని ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని హ్యుందాయ్ మోబిస్‌కు వినతి చేశారు. టైర్-1 ఆటోమొబైల్ సరఫరాదారుల సమావేశాన్ని ఏపీలో నిర్వహించాలని ప్రతిపాదించారు. హ్యుందాయ్ మోబిస్ విస్తరణకు ఏపీ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని లోకేశ్ స్పష్టం చేశారు. అనంతపురం యూనిట్‌లో హ్యుందాయ్, కియా కోసం కీలక మాడ్యూల్స్ తయారు చేయనున్నట్లు హ్యుందాయ్ మోబిస్ తెలిపింది. ఏపీ ప్రతిపాదనలపై ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
అపాక్ట్ సీఈవోతో సమావేశం..
అపాక్ట్ సీఈవో సియాంగ్ డాంగ్ లీతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. OSAT సెమీకండక్టర్ నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. APSSDCతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని అపాక్ట్‌కు ప్రతిపాదన చేశారు. ఇతర OSAT కంపెనీలను ఏపీకి తీసుకురావాలని అపాక్ట్‌ను కోరారు. హనా మైక్రాన్ వంటి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అపాక్ట్ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తామని మంత్రి చెప్పారు. విశాఖ OSAT ప్రాజెక్టు ఏపీకి ప్రతిష్ఠాత్మక విజయమని.. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని అపాక్ట్ సీఈవో వెల్లడించారు. విశాఖలో ASIP–APACT OSAT యూనిట్ నిర్మాణం త్వరలో ప్రారంభంకానుంది. రూ.468 కోట్ల పెట్టుబడితో విశాఖలో సెమీకండక్టర్ OSAT యూనిట్ రానుంది. ఏడాదికి 9.6 కోట్ల పరికరాల తయారీ లక్ష్యంతో విశాఖ OSAT యూనిట్ పనిచేయనుంది.
ఇవి కూడా చదవండి...
తిరుపతిలో వైసీపీ నేతలపై కేసు..
క్రాంతికుమార్ ఆత్మహత్య ఉదంతంలో సీఐ నాగరాజుపై మరో కేసు
Read Latest AP News And Telugu News