Share News

కొండా సురేఖ-కడియం శ్రీహరి మధ్య ముదురుతున్న వివాదం

ABN , Publish Date - Jul 07 , 2026 | 12:05 PM

మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారంటూ మంత్రి సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కొండా సురేఖ-కడియం శ్రీహరి మధ్య ముదురుతున్న వివాదం
Warangal Politics

వరంగల్, జులై 7: మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారంటూ మంత్రి సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. నిన్న(సోమవారం) వరంగల్ నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్‌కు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను కోరినట్లు తెలిసింది.


వరంగల్ జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకోవడంపై మంత్రి కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై AICCతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ పరిణామంతో కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య కొనసాగుతున్న రాజకీయ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పందన ఏంటనేది ఆసక్తికరంగా మారింది.


ఇవి కూడా చదవండి...

ఏబీఎన్‌ ఎఫెక్ట్.. వరంగల్ ముంపు ప్రాంతాల్లో కొండా మురళీ పర్యటన

రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య..​ 33 పేజీల సూసైడ్ నోట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 12:32 PM