ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కి ప్రమాదం..
ABN , Publish Date - Feb 18 , 2026 | 10:54 AM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కి స్వల్ప ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం విశాఖపట్నంలోని సిరిపురం నుంచి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కి స్వల్ప ప్రమాదం జరిగింది. ఇవాళ(బుధవారం) ఉదయం విశాఖపట్నంలోని సిరిపురం నుంచి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా.. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్‌లోని ఓ వాహనం హఠాత్తుగా బ్రేక్ వేసింది. దీంతో వెనక వైపుగా వస్తున్న మరో కాన్వాయ్ ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ఘటనలో వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ ప్రమాద సమయంలో పవన్ కల్యాణ్ కాన్వాయ్‌లో లేరని అధికారులు తెలిపారు. ఆయన్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మికి ఎదురుదెబ్బ
ఏడు రకాల క్యాన్సర్లను గుర్తించే కిట్!
Read Latest AP News And Telugu News