రేపటి నుంచి మోదకొండమ్మ గర్భగుడి మూసివేత
ABN , Publish Date - May 03 , 2026 | 11:12 PM
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ ఆలయ గర్భగుడిని ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ నెల 9వ తేదీ వరకు మూసివేస్తారు. తిరిగి ఈ నెల 10న తెరిచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
10న అమ్మవారి పునర్దర్శనం
పాడేరురూరల్, మే 3 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ ఆలయ గర్భగుడిని ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ నెల 9వ తేదీ వరకు మూసివేస్తారు. తిరిగి ఈ నెల 10న తెరిచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మోదకొండమ్మ అమ్మవారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల 12న అమ్మవారి తీర్థ మహోత్సవాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో అమ్మవారి మూలవిరాట్‌కు రంగులు, అలంకరణ చేపడుతున్నందున గర్భగుడిని మూసివేయనున్నామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ కమిటీకి సహకరించాలని ఆయన కోరారు.