Share News

వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా డ్వాక్రా ఉత్పత్తుల విక్రయాలకు లోకేశ్ ప్రయత్నం

ABN , Publish Date - Nov 12 , 2026 | 04:35 PM

విశాఖలో వాల్‌మార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాల్ డైక్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఏపీ డ్వాక్రా మహిళా సంఘాల ఉత్పత్తులకు వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ సరఫరా వ్యవస్థల్లో అవకాశం కల్పించాలని ప్రతిపాదించారు.

వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా డ్వాక్రా ఉత్పత్తుల విక్రయాలకు లోకేశ్ ప్రయత్నం
Minister Nara Lokesh

విశాఖపట్నం, నవంబర్ 12: విశాఖలో వాల్‌మార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాల్ డైక్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ఏపీ డ్వాక్రా మహిళా సంఘాల ఉత్పత్తులకు వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ సరఫరా వ్యవస్థల్లో అవకాశం కల్పించాలని ప్రతిపాదించారు. స్వయం ఏపీ, లేపాక్షి బ్రాండ్ల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఏపీ ఎంఎస్ఎంఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్త కొనుగోలుదారులను ఆహ్వానించాలని వాల్‌మార్ట్‌కు సూచించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని వాల్‌మార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాల్ డైక్ తెలిపారు.


wallmart-lokesh-1.jpg

ఏపీ నుంచి ఏటా 6.5 కోట్ల పౌండ్లకు పైగా రొయ్యలను వాల్‌మార్ట్ కొనుగోలు చేస్తోంది. వీటితో పాటు రాష్ట్రానికి చెందిన ఫార్మా, వస్త్రాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులను కూడా వాల్‌మార్ట్ కొనుగోలు చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడులతో ఏపీలో 28 వేలకుపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా లాజిస్టిక్స్ హబ్‌ల ద్వారా ఫ్లిప్‌కార్ట్ సేవలను అందిస్తోంది. ఏపీలో 3,200కు పైగా ఎంఎస్ఎంఈలకు శిక్షణ, 900కు పైగా సంస్థలకు ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ మార్కెట్‌ప్లేస్‌లో అవకాశం లభించింది.

wallmart-lokesh-2.jpg


ఇవి కూడా చదవండి...

1,053 కి.మీ తీరప్రాంతం ఏపీకి వ్యూహాత్మక బలం: మంత్రి బీసీ జనార్దన్

కాలేజ్ యాజమాన్యం వేధింపులు.. ఇద్దరు విద్యార్థినిల ఆత్మహత్యాయత్నం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 04:53 PM