హెడ్ కానిస్టేబుల్ సాహసం
ABN , Publish Date - Sep 16 , 2026 | 05:55 AM
తుని రైల్వేస్టేషన్‌లో రైలు, ప్లాట్‌ఫాం మధ్య చిక్కుకున్న చెన్నైకి చెందిన ప్రయాణికుడిని హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు సమయస్ఫూర్తితో రక్షించారు. ప్రమాదకర పరిస్థితుల్లో బాధితుడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.
రైలు-ప్లాట్‌ఫాం మధ్య చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన వైనం
తుని రూరల్, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి రైలు, ప్లాట్‌ఫాం మధ్య చిక్కుకున్న ఓ వ్యక్తిని హెడ్‌కానిస్టేబుల్ చంద్రరావు సమయస్ఫూర్తితో రక్షించారు. కాకినాడ జిల్లా తుని రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. చెన్నైకి చెందిన ప్రేమ్‌కుమార్ గణేషన్ తుని రైల్వే స్టేషన్‌లో చెన్నై వెళ్లేందుకు రైలు ఎక్కాడు. కానీ .. అది చెన్నై వెళ్లదని, తాను వెళ్లాల్సిన రైలు పక్క ప్లాట్‌ఫాంపై ఉందని తెలిసి దిగేశాడు.
హడావుడిగా పక్క ప్లాట్‌ఫాంపైకి వెళ్లి ఆ రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి రైలుకు, ప్లాట్‌ఫాంకు మధ్య చిక్కుకున్నారు. అదే రైలులో ప్రయాణిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ చంద్రరావు వెంటనే రైలును నిలిపివేయించి.. ఏమాత్రం సంకోచించకుండా కిందకు దూరి బాధితుడిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ప్రేమ్‌కుమార్‌కు వెంటనే 108 అంబులెన్స్‌లో తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రాణాపాయం తప్పడంతో కుటుంబసభ్యులు ఆయనను చెన్నైకి తీసుకెళ్లినట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తన్నుకున్న టీడీపీ నేతలు
ఆర్మీ ఎంపికలో విషాదం.. రన్‌లో యువకుడి మృతి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News