మీ రాష్ట్రంతో మాకు చేదు అనుభవం
ABN , Publish Date - Sep 16 , 2026 | 04:51 AM
గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌కు రుణాల విషయంలో ప్రపంచబ్యాంకుకు రాష్ట్రం నుంచి, విదేశాల నుంచి హెచ్చరికలతో కూడిన ఈ-మెయిల్స్ వచ్చినట్లు ప్రపంచబ్యాంకు బృందం అధికారులకు తెలిపింది.
రాజధానికి నిధులిచ్చేందుకు రెడీగా ఉంటే అప్పులు తీర్చడం కష్టమని మెయిల్స్ వచ్చాయ్
వైసీపీ నుంచి హెచ్చరిక మెయిల్స్ కూడా ప్రపంచబ్యాంకు బృందం వెల్లడి
అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): 2014-19 నడుమ ప్రతిపక్ష నేతగా, 2019-24 మధ్య సీఎంగా జగన్ అనుసరించిన విధ్వంసక విధానాల ప్రభావం ప్రపంచ బ్యాంకుపై గట్టిగానే పడింది. రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి కార్యక్రమాలకూ నిధులిచ్చేందుకు సానుకూలంగా ఉన్నా.. గత ప్రభుత్వం, వైసీపీ నుంచి తమకు చేదు అనుభవం ఎదురైందని వరల్డ్ బ్యాంకు బృందం మంగళవారంరాష్ట్ర అధికారులకు తెలిపింది.
ఆ పదేళ్లలో రాజధాని అమరావతికి నిధులు సిద్ధమైనప్పుడు.. తమకు రాష్ట్రంలో నుంచే కాకుండా.. అమెరికా, ఇంగ్లండ్ తదితర దేశాల నుంచి కూడా వరుసగా ఈ-మెయిల్ సందేశాలు వచ్చాయని గుర్తుచేసింది. ప్రభుత్వం తీసుకునే అప్పులను తీర్చలేని పరిస్థితి నెలకొంటుందంటూ హెచ్చరికలతో కూడి మెయిళ్లు తమకు వైసీపీ నుంచి వచ్చాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌కు రుణం ఇవ్వాలంటే తటపటాయించాల్సి వస్తోందని ప్రపంచ బ్యాంకు బృందం తెలిపింది. ఆర్థిక శాఖ స్పందిస్తూ.. ఇప్పుడా పరిస్థితి లేదని తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించేందుకు సిద్ధంగానే ఉన్నామని ప్రపంచబ్యాంకు సానుకూలత వ్యక్తం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రానికి మజగావ్ డాక్!
కొలువుల జాతర
Read Latest Telangana News And AP News And National News
And Telugu News