Share News

కొలువుల జాతర

ABN , Publish Date - Sep 16 , 2026 | 04:11 AM

ఏపీపీఎస్సీ ఒకేసారి 892 పోస్టుల భర్తీకి 20 నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో డీఎస్పీ, డిప్యూటీ కలెక్టర్‌ తదితర 163 గ్రూప్‌-1 పోస్టులు ఉన్నాయి. అక్టోబరు 6 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా, నాన్‌ యూనిఫాం ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లుగా కొనసాగనుంది.

కొలువుల జాతర
APPSC Group 1 notification 2026

  • గ్రూప్‌-1 సహా 892 పోస్టుల భర్తీ

  • 20 నోటిఫికేషన్లు జారీ చేసిన ఏపీపీఎస్సీ

  • వీటిలో డీఎస్పీ సహా గ్రూప్‌-1 పోస్టులు 163

  • 2026 జాబ్‌ క్యాలెండర్‌లో ఇది రెండో విడత

  • అక్టోబరు 6 నుంచి దరఖాస్తు ప్రక్రియ

  • గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు కొనసాగింపు

అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఒకేసారి 892 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) 20 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ ఏడాది ఇచ్చిన జాబ్‌ క్యాలెండర్‌లో ఇది రెండో విడత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కావడం విశేషం. తొలి విడత నోటిఫికేషన్లు మే నెలలో జారీ అయ్యాయి. తాజాగా మంగళవారం విడుదల చేసిన నోటిఫికేషన్లలో 163 గ్రూప్‌-1 పోస్టులు ఉన్నాయి. వీటి దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 6వ తేదీ నుంచి ప్రారంభమై 27వతేదీ వరకు కొనసాగనుంది. మరికొన్ని పోస్టులకు దరఖాస్తు గడువు వేర్వేరుగా నిర్ణయించారు. కాగా, ఈ నోటిఫికేషన్లలో ఖాళీలు, అర్హతలను తాత్కాలికంగా భావించాలని, పూర్తిస్థాయి నోటిఫికేషన్లు త్వరలో విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది.


  • బీసీ సంక్షేమ శాఖ హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 పోస్టులు 29, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 పోస్టులు 21, గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 పోస్టులు 23, గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు 6, సాంఘిక సంక్షేమ శాఖలో అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు అక్టోబరు 9 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • ఏపీ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటికల్‌ సర్వీసులో అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టులు 196, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులు 17, గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టు ఒకటి, ఫ్యాక్టరీస్‌ సర్వీ్‌సలో ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ పోస్టులు 12, కాలుష్య నియంత్రణ మండలిలో గ్రేడ్‌-2 అనలిస్ట్‌ పోస్టులు 18, లెజిస్లేచర్‌ సర్వీసులో ఇంగ్లిష్‌ రిపోర్టర్‌ పోస్టులు 10, తెలుగు రిపోర్టర్‌ పోస్టు ఒకటి ఉన్నాయి. వీటికి అక్టోబరు 13 నుంచి నవంబరు 2 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.

  • దేవదాయశాఖలో గ్రేడ్‌-3 ఈవో పోస్టులు 104, జువైనల్‌ వెల్ఫేర్‌ సర్వీసులో గ్రేడ్‌-2 జిల్లా ప్రొబేషన్‌ ఆఫీసర్‌ పోస్టులు 15, పరిశ్రమల శాఖలో ఇండస్ర్టియల్‌ ప్రమోషన్‌ ఆఫీసర్స్‌ పోస్టులు 78, మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్‌-1 సూపర్‌వైజర్‌ పోస్టులు 29, అటవీ శాఖలో ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు 26, డ్రాఫ్ట్స్‌మెన్‌ గ్రేడ్‌-2 పోస్టులు 20, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులు 23, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టులు నాలుగు ఉన్నాయి. వీటికి అక్టోబరు 16 నుంచి నవంబరు 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.


44 ఏళ్లు వర్తింపు

నాన్‌ యూనిఫాం సర్వీసు ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని 44గా కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. యూనిఫాం సర్వీసులకు ప్రస్తుత పరిమితిని కేటగిరీల వారీగా రెండేళ్లు పెంచింది. నాన్‌ యూనిఫాం సర్వీసులకు వయో పరిమితి 44 ఏళ్లు కొనసాగుతుందని సాధారణ పరిపాలన స్పష్టం చేసింది. ఈ మేరకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 44 ఏళ్ల వయో పరిమితి వచ్చే ఏడాది సెప్టెంబరు వరకు కొనసాగుతుందని పేర్కొంది.


గ్రూప్‌-1 ఉద్యోగాలు ఇవే..

పోస్టు

పోస్టుల సంఖ్య

డిప్యూటీ కలెక్టర్‌

11

స్టేట్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌

14

డీఎస్పీ సివిల్‌ గ్రేడ్‌-2

36

డీఎస్పీ కమ్యూనికేషన్స్‌

3

జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో)

14

ప్రాంతీయ రవాణా శాఖ అధికారి

3

జిల్లా గిరిజన సంక్షేమ అధికారి

1

కోపరేటివ్‌ డిప్యూటీ రిజిస్ర్టార్‌

15

గ్రేడ్‌-2 మున్సిపల్‌ కమిషనర్‌

12

సహాయ ఖజానా అధికారి

2

జిల్లా ఉపాధి కల్పన అధికారి

3

సహాయ గణాంక అధికారి

14

ప్రాంతీయ అభివృద్ధి అధికారి

35


ఈ వార్తలు కూడా చదవండి..

బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం
ఫ్రీహోల్డ్‌కు విముక్తి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 04:12 AM