Share News

ఆర్మీ ఎంపికలో విషాదం.. రన్‌లో యువకుడి మృతి

ABN , Publish Date - Sep 16 , 2026 | 05:45 AM

విశాఖలో ఆర్మీ ఎంపికల 1,600 మీటర్ల రన్‌లో పాల్గొన్న 18 ఏళ్ల యువకుడు శ్వాస సమస్యతో కుప్పకూలారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

ఆర్మీ ఎంపికలో విషాదం.. రన్‌లో యువకుడి మృతి
Army Recruitment Tragedy

మద్దిలపాలెం(విశాఖపట్నం), సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఆర్మీ జవానుగా దేశసేవ చేయాలని కలలు కన్నాడు. విశాఖలో జరుగుతున్న ఎంపికల్లో పాల్గొన్నాడు. రన్‌లో పాల్గొని లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఎంపికైన ఆనందం ఎంతో సమయం నిలవలేదు. శ్వాస సమస్య వచ్చి కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన మంగళవారం విశాఖలో చోటుచేసుకుంది.


పోలీసులు తెలిపిన వివరాలు.. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల గ్రామానికి చెందిన గిన్ని శేషగిరిరావు(18) మంగళవారం ఉదయం 4.30 గంటలకు ఆర్కే బీచ్‌ రోడ్డులో నిర్వహించిన 1,600 మీటర్ల రన్‌లో పాల్గొని ఎంపికయ్యాడు. అయితే కొద్దిసేపటికే శ్వాస సమస్య వచ్చి నిల్చున్నచోటే కుప్పకూలిపోయాడు. శేషగిరిరావును కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

తన్నుకున్న టీడీపీ నేతలు
బోడెన్సీ సరస్సు ఈదిన డీఎస్సీ విజేత

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 05:45 AM