దసరా, దీపావళికి అదనపు రైళ్లు.. 135 రైళ్లకు అదనపు బోగీలు: రైల్వే సీపీఆర్వో
ABN , Publish Date - Oct 19 , 2026 | 09:19 PM
దసరా, దీపావళి పండుగలు, ఛాట్ పూజ పురస్కరించుకుని సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో జన సాధారణ రైళ్లు నడుపుతామని సీపీఆర్వో బాలాజీ కిరణ్ వెల్లడించారు.
విశాఖపట్నం, అక్టోబర్19: దసరా, దీపావళి పండుగలు, ఛాట్ పూజ పురస్కరించుకుని సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో జన సాధారణ రైళ్లు నడుపుతామని సీపీఆర్వో బాలాజీ కిరణ్ వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లు సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ - తిరుపతి, విజయవాడ - పలాస, విశాఖ - విజయవాడ మధ్య మెము ప్యాసింజర్ రైళ్లు నడుపుతామని చెప్పారు. అలాగే 135 రైళ్లకు అదనపు బోగీల సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
2028 నాటికి విశాఖపట్నంలోని ముడసరలోవలో నిర్మిస్తున్న దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయం పూర్తవుతుందని చెప్పారు. ఈ భవనంలో ఇప్పటికే మూడు ఫ్లోర్లు పూర్తయ్యాయని అన్నారు. నాలుగో ఫ్లోర్ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. రైల్వే అధికారుల నివాస గృహాలు కూడా కార్యాలయం సమీపంలోనే నిర్మిస్తున్నట్లు సీపీఆర్వో బాలాజీ కిరణ్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వేచ్ఛగా, పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణే లక్ష్యం: ఎస్ఈసీ
మహా పూర్ణాహుతితో ముగియనున్న ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు: ఈవో శీనా నాయక్
For More AP News And Telugu News