Share News

స్వేచ్ఛగా, పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణే లక్ష్యం: ఎస్ఈసీ

ABN , Publish Date - Oct 19 , 2026 | 08:46 PM

స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యమని అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.

స్వేచ్ఛగా, పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణే లక్ష్యం: ఎస్ఈసీ
AP SEC Anil Chandra Punetha

అమరావతి, అక్టోబర్ 19: స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యమని అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. సోమవారం రాజధాని అమరావతిలో ఈ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.


ఈ సందర్భంగా ఎస్ఈసీ పునేఠా మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్, మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని వారిని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు.


ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావు లేకుండా, నిబంధనలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పాటిస్తూ.. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా తగిన వాతావరణాన్ని కల్పించాలని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహా పూర్ణాహుతితో ముగియనున్న ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు: ఈవో శీనా నాయక్

కనకదుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి: సీఎం చంద్రబాబు

For More AP News And Telugu News

Updated Date - Oct 19 , 2026 | 08:53 PM