ప్రజలకు అజిత్ పవార్ ఎనలేని సేవ చేశారు: బండి సంజయ్
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:58 PM
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవార్ మంచి నాయకుడని.. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రజలకు ఎనలేని సేవ చేశారని కీర్తించారు.
విశాఖపట్నం, జనవరి28 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవార్ మంచి నాయకుడని.. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రజలకు ఎనలేని సేవ చేశారని కీర్తించారు. బుధవారం విశాఖపట్నంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కరెక్షనల్ అడ్మినిస్ట్రేటర్ల 9వ జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ హాజరయ్యారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులు, రక్షణ శాఖ సిబ్బంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. విశాఖపట్నంలో 9వ అంతర్జాతీయ జైలు అధికారుల సమ్మేళనాన్ని ప్రతి రెండు సంవత్సరాలకు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. జాతీయ స్థాయిలో జైళ్ల అంశాలమీద చర్చలు జరగుతాయని చెప్పుకొచ్చారు. జైల్లో ఆధునికీకరణ కోసం రూ.950 కోట్లు, ఖైదీల సురక్షిత సంక్షేమ కోసం రూ.161 కోట్లను కేంద్రప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. నిర్థణ్ సహాయ విజన్‌లో భాగంగా ఖైదీల కోసం రూ.20 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. ప్రతి ఏడాది జైళ్లలో అనేక రకాల మార్పులు తీసుకురావాలని సూచించారు. ఖైదీలను వారి కుటుంబ సభ్యులు కలవడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయని వివరించారు. జైల్ నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వంలోకి వస్తోందని.. అయిన ఏపీ సర్కార్‌కి కేంద్రప్రభుత్వం సహకరిస్తోందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అజిత్ పవార్ మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై సీఎం చర్చ
Read Latest AP News And Telugu News