Share News

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో!

ABN , Publish Date - Sep 08 , 2026 | 09:02 PM

అనకాపల్లి జిల్లా కె. కోటపాడు మండలంలో మరో అవినీతి అధికారి వెలుగులోకి వచ్చాడు. ఏసీబీ అధికారులు చేసిన దాడిలో వీఆర్వో అడ్డంగా దొరికిపోయాడు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో!
Anakapalli ACB raid

అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 08: అనకాపల్లి జిల్లా కె. కోటపాడు మండలంలో మరో అవినీతి అధికారి వెలుగులోకి వచ్చాడు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేసిన దాడిలో వీఆర్వో అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... కె. కోటపాడు మండలం వారాడ గ్రామానికి చెందిన వీఆర్వో సూర్యనారాయణ మ్యుటేషన్ పని కోసం ఒక రైతు నుంచి రూ.20,000 లంచం డిమాండ్ చేశారు.


బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వీఆర్వో సూర్యనారాయణ లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీకి సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు సూచించారు.


Also Read:

స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబీకులు..

ద్రోణి ప్రభావం.. ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు

Updated Date - Sep 08 , 2026 | 09:02 PM